సీఎం జగన్ సంచలన నిర్ణయం : మంత్రివర్గ ప్రక్షాళన - అయిదుగురు మంత్రులు అవుట్..!?

ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయిదుగురు మంత్రుల పై వేటు వేసి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు.

ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు సీఎం నిర్ణయించారు. దీనికి సంబంధించి కసరత్తు తుది దశకు చేరింది. ప్రస్తుత మంత్రివర్గంలో అయిదుగురిని తప్పించేందుకు రంగం సిద్దమైంది. వారి స్థానంలో కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక అవుతున్న వారిలోనే ఈ అయిదుగురు ఉండనున్నారు. ఈ నెలాఖరులో విస్తరణ ఉంటుందని విశ్వసనీయ సమాచారం. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయం కేబినెట్..పార్టీలో కలకలం రేపుతోంది. ఎవరు అవుట్..ఎవరికి ఇన్ అనే అంచనాలు మొదలయ్యాయి.

మరోసారి జగన్ కేబినెట్ ప్రక్షాళన

మరోసారి జగన్ కేబినెట్ ప్రక్షాళన

ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి అయిదుగురు డిప్యూటీ సీఎంలతో కలిపి 25 మందితో తొలి కేబినెట్ రూపకల్పన చేసారు. పక్కా సామాజిక సమీకరణాలను అమలు చేసారు. వారిని రెండున్నారేళ్లకు మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. అదే విధంగా 11 మంది పాతవారిని కొనసాగిస్తూ మరో 14 మందికి కొత్తగా ఛాన్స్ ఇస్తూ కేబినెట్ ప్రక్షాళన చేసారు. అయితే, ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. పాలనా - పార్టీ పరంగా మంత్రులు -ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం జగన్ సర్వే నివేదికలతో సిద్దమయ్యారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్ ఊహించని విధంగా అయిదుగురు మంత్రుల పైన వేటుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. తప్పిస్తున్న మంత్రుల ద్వారా ఎక్కడా సామాజిక సమీకరణం దెబ్బ తినకుండా కొత్త వారి ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా కొత్తగా ఎమ్మెల్సీలు ఖరారు విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

అయిదుగు అవుట్ - కొత్త వారికి ఛాన్స్

అయిదుగు అవుట్ - కొత్త వారికి ఛాన్స్


ప్రస్తుత కేబినెట్ లో అయిదుగురు మంత్రులపై వేటు పడనుందని సమాచారం. అందులో కీలక శాఖ నిర్వహిస్తున్న మహిళా మంత్రి ఉన్నారని తెలుస్తోంది. ఆ మహిళా మంత్రి స్థానంలో సుదీర్ఘ కాలం పార్టీ కోసం పని చేస్తూ ఎమ్మెల్సీగా అవకాశం కోసం నిరీక్షిస్తున్న నేతకు ఇప్పుడు కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పిస్తూ..ఎమ్మెల్సీ ఖాయం చేయనున్నారు. అదే విధంగా ప్రతిపక్షాలకు ఆరోపణలకు అవకాశం ఇచ్చిన సీమ జిల్లాలకు చెందిన ఒక మంత్రిని తప్పిస్తారని తెలుస్తోంది. అదే జిల్లా నుంచి సీనియర్ గా ఉన్న ఒక ముఖ్య నేత కేబినెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక, గోదావరి జిల్లాలోని సీనియర్ మంత్రిని వ్యక్తిగత కారణాలతో తప్పిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా అనుభవం..వయసు తక్కువే అయినా మంత్రిగా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవటంలో వెనుకబడిన మంత్రిని తప్పిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో గోదావరి జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం దక్కనుంది. ఒకే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక జిల్లాలోనూ ఆయన స్థానంలో సీనియర్ ను కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సీఎం జగన్ సీరియస్.. ఎమ్మెల్యేల్లో టెన్షన్

సీఎం జగన్ సీరియస్.. ఎమ్మెల్యేల్లో టెన్షన్


ఇప్పుడు అనూహ్యంగా మంత్రుల పని తీరు ఆధారంగా వారి పైన వేటు వేసేందుకు జగన్ సిద్దమయ్యారు. దీంతో..ఇప్పటి వరకు పని తీరు మెరుగు పర్చుకోవాలంటూ హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు శాసనమండలిలో వైసీపీకి కొత్తగా 18 మంది ఎమ్మెల్సీలు రానున్నారు. పార్టీ కోసం సేవ చేసి..పదవులు దక్కని వారికి ఈ సారి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీ - ప్రభుత్వంలో అనుభవం ఉన్న వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులుగా తీసుకోవాలని నిర్ణయించిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత కేబినెట్ విస్తరణకు అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ ఎవరి పైన వేటు వేస్తారు..ఎవరికి కేబినెట్ లో సీటు ఇస్తారనేది ఉత్కంఠకు కారణమవుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇదే కసరత్తులో బిజీగా ఉన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావటం కోసం పని తీరు ప్రామాణికంగా సీఎం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+