ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - స్థలాలపై పన్నుల్లో వీరికి భారీగా మినహాయింపు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థలాల పన్నుల పైన తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో రెండో దశ లాండ్ పూలింగ్ తో పాటు గా ప్రభుత్వ వైద్య కళాశాలల వివాదం పైనా నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన నిర్ణయాల పైన చర్చించిన కేబినెట్.. ఖాళీ స్థలం.. నిర్మాణాలు.. పన్నుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం ఖాళీ స్థలం పన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా పుర, నగరపాలక సంస్థల పరిధిలో నిర్మాణాలు చేపట్టే కాలంలో ఆ స్థలానికి సంబంధించిన ఖాళీ స్థలం పన్నుపై 50 శాతం మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా వచ్చిన ప్రతిపాదన పైన చర్చించిన మంత్రివర్గం.. ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అదే విధంగా పట్టణ స్థానిక సంస్థల్లో డిస్‌ప్లే బోర్డులు (హోర్డింగ్‌లు), సైన్‌బోర్డులు, బస్సులు, ఆటోల మీద ప్రకటనలు ప్రదర్శించే సంస్థలు ఇక నుంచి విధిగా లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పురపాలక నియమావళిలో చేసిన సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఆయుష్‌ను అలోపతికి సమానంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ -2002లో కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తారు. కాగా, 18 ఏళ్లు వయసు నిండినవారు ఓటరుగా నమోదవ్వాలంటే ఇప్పటిదాకా ఏడాదికి ఒక్కసారి (జనవరి 1) మాత్రమే అవకాశం ఉండేది.
ఇకపై ఏడాదికి నాలుగుసార్లు (జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1వ తేదీ) అవకాశం కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసే ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించింది. 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణకు వర్కింగ్ క్యాపిటల్ నిబంధనలకు అనుగుణంగా ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం. ఇప్పటికే జారీ చేసిన జీవో ర్యాటిఫికేషన్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications