ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఫీజల నియంత్రణపై కేబినెట్ కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇక.. మావిగన్ వివాదం వేళ అమరావతి కేంద్రంగా ఏపీ మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే విధంగా 28 జిల్లాల ఏర్పాటు తో జోన్ .. మల్టీ జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. పాలనా పరంగా తీసుకునే ముఖ్య నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం చర్చించి.. ఆమోదం తెలపనుంది.

ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. కీలక అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా చర్చ జరగనుంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, మల్టీ జోనల్ వ్యవస్థ అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆమోదం పొందిన తరువాత గెజిట్ జారీ చేయనున్నారు. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ట్‌ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్‌ లీవ్‌ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం రూ.2,950 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోందని, ఈ నిధులు రిటైర్డ్‌ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. సర్వీసు లో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక, ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ap-cabinet-likely-to-approve-zonal-system-in-the-state-also-green-signal-for-new-proposals-in-amarav

కీలక అంశాల పై చర్చ.. ఆమోదం

ఇటీవల పార్లమెంట్‌లో రాజధాని అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ కృతజ్ఞతలు తెలపనుంది. ఇక పెట్టుబడుల అంశంలో భాగంగా, 16వ ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు, ఉపాధి అవకాశాలను కూడా పెంచనున్నాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ కింద మూడు ప్రముఖ సంస్థల స్థాపనకు కూడా క్యాబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యా రంగానికి సంబంధించి ఫీజు రెగ్యులేటరీ కమిటీ (FRC) ఏర్పాటు కోసం ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదం తెలపనున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపై చ‌ర్చించ‌నున్న క్యాబినెట్.. ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల‌కు అమోదం తెల‌ప‌నుంది. మావిగన్ పైన వైసీపీ చేస్తున్న ప్రచారం వేళ.. రాజకీయంగానూ అధికారిక అజెండా పూర్తయిన తరువాత మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించి.. కీలక దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+