గౌతమ్ రెడ్డి స్థానంలో మంత్రిగా - అసెంబ్లీ వేదికగా ప్రకటనతో : శాఖలు ఆ ముగ్గురికే..!!
మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తో సీఎం జగన్ కేబినెట్ ఖాళ ఏర్పడింది. ఇప్పుడు ఆ స్థానం ఎవరితో భర్తీ చేయాలనే అంశం పైన కసరత్తు మొదలైంది. మేకపాటి కుటుంబం తొలి తనకు అండగా నిలవటం తో పాటుగా..తన సహచర మంత్రిగా ఉన్న గౌతమ్ చిన్న వయసులోనే మరణించటంతో సీఎం జగన్ ఆ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మేకపాటి రాజ మోహన్ రెడ్డి తన కుమారుడి పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఉదయగిరి లోని మేకపాటి కాలేజీని ఇవ్వటానికి ముందుకొచ్చారు. దీని పైన ఈ నెల 7వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

8న అసెంబ్లీ వేదికగా క్లారిటీ
ఇప్పటికే మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక, త్వరలో కేబినెట్ విస్తరణ జరగనున్న సమయంలో ఈ జిల్లా నుంచి పలువురు ఆశావాహులు మంత్రి పదవి కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో.. మేకపాటి కుటుంబానికి రాజకీయంగా ఇవ్వాల్సిన ప్రాధాన్యత పైన ఆ జిల్లా నేతలతో చర్చించే బాధ్యత సీఎం జగన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు అప్పగించారు. ఈ నెల 3 ,4 తేదీల్లో సజ్జల నెల్లూరు వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక, ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 8వ తేదీన సభలో గౌతమ్ కు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఆ సమయంలోనే గౌతమ్ కుటుంబానికి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోయే అంశం పైన సీఎం జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గౌతమ్ సతీమణి అంగీకరిస్తే.. మంత్రిగా
గౌతమ్ సతీమణి శ్రీకీర్తి అంగీకరిస్తే కేబినెట్ లో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. అందు కోసం శ్రీకీర్తిని ఒప్పించేందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డితో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రిగా తీసుకున్న తరువాత ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇప్పటికే అసెంబ్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆత్మకూరు స్థానం ఖాళీ అయినట్లుగా నివేదిక వెళ్లింది. దీంతో..ఆరు నెలల్లోగా ఎన్నిక జరగనుంది. గౌతమ్ సతీమణి అంగీకరించి..మంత్రిగా అవకాశం ఇస్తే.. ఆమె ఆత్మకూరు అభ్యర్ది కానున్నారు. ఆ సమయంలో ఇతర పార్టీలు ఎవరూ పోటీ పెట్టే అవకాశం లేదు. దీంతో..ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అదే సమయంలో.. ఇప్పటికిప్పుడు గౌతమ్ సతీమణి మంత్రి పదవి స్వీకరణకు నిరాకరిస్తే..కేబినెట్ విస్తరణ సమయం వరకు వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

నెల్లూరు నేతలు - మేకపాటి ఫ్యామిలీ తో చర్చ
అప్పటికి మేకపాటి కుటుంబం నుంచి వచ్చే సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఏప్రిల్ లో కేబినెట్ విస్తరణకు ఛాన్స్ కనిపిస్తోంది. మే నెలాఖరుకు సీఎం జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి కానుంది. అదే విధంగా ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. దీంతో..మంత్రివర్గ విస్తరణ సైతం పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. గౌతమ్ హఠాన్మరణంతో..ఇప్పుడు మేకపాటి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
Recommended Video

శాఖలు ఆ ముగ్గురికీ కేటాయించేలా
ఇక, అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం గౌతమ్ నిర్వహించిన అయిదు శాఖలను ముగ్గురు మంత్రులకు కేటాయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ మంత్రి బొత్సా.. ఆర్దిక మంత్రి బుగ్గన.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లకు వీటిని అదనపు పోర్టు ఫోలియోలుగా కేటాయించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వరకు మాత్రమే వాటికి బాధ్యత వహించేలా నిర్ణయిం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక, ఒకటి రెండు రోజుల్లోనే మేకపాటి కుటుంబానికి రాజకీయంగా..ప్రభుత్వంలో దక్కే ప్రాధాన్యత పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications