విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానికి ఎన్టీఆర్ పేరు: టీడీపీలోనే 'నో'! హైద్రాబాద్‌లా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

AP Capital gets names before birth
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అనే విషయం దాదాపు ఖరారైనప్పటికీ అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. రాజధాని ఏదనే విషయం అధికారికంగా తేలకముందే పేరు విషయంలో కొత్త కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొత్త రాజధానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ పేరు పైన ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

పత్తిపాటి పుల్లారావుతో పాటు మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, సీనియర్ టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్రలు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు. కొత్త రాజధానికి ఎన్టీఆర్ నగర్ లేదా తారకరామ నగర్ అని పెట్టాలని సూచించారు. గుజరాత్‌లో గాంధీనగర్ ఉన్నదని, అలా ఎన్టీఆర్ పేరు ఏపీకి పెట్టాలన్నారు. అయితే, కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎన్టీఆర్ పేరును వద్దని చెబుతున్నారట.

కొత్త రాజధానికి ఎన్టీఆర్ నగర్ అని పేరు పెడితే.. హైదరాబాదులోని ఎన్టీఆర్ నగర్‌లో స్లమ్ ఏరియా అనుకునే అవకాశముందని చెబుతున్నారని తెలుస్తోంది. వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గ పేరు చూడాలని, ఎన్టీఆర్ నగర్ అనే దానిని పక్కన పెట్టడమే బాగుంటుందని చెబుతున్నారట. అయితే, తారకరామ నగర్ వంటి వాటికి వారి ఓకే చెబుతున్నారని తెలుస్తోంది.

కొందరు ఎమ్మెల్యేలు అమరావతి పేరును సూచిస్తున్నారని తెలుస్తోంది. రాజధానిలో ఏర్పాటు చేయనున్న అధికార భవంతులకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందని, అలాగే రాజధానిలో ఎన్టీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారని తెలుస్తోంది. రాజధానికి అమరావతి పేరును పెట్టేందుకు ఓ ఎమ్మెల్యే ఏకంగా సంతకాల సేకరణ కూడా చేపట్టినట్లుగా తెలుస్తోంది.

English summary
Even before the official announcement by the state government on the location of new capital, Telugu Desam MLAs and ministers have started pressuring Chief Minister N. Chandrababu Naidu to name the capital according to their choice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X