సింగపూర్ మంత్రి కోసం దిగొచ్చిన బాబు(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం జపాన్, సింగపూర్ దేశాలు సహకరిస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

సచివాలయానికి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.

ఈశ్వరన్‌ వస్తున్నారన్న సమాచారంతో ఎల్‌ బ్లాకులోని ఎనిమిదో అంతస్తులో ఉన్న చంద్రబాబు చాంబర్‌ నుంచి కిందికి దిగివచ్చి తానే స్వయంగా పూలబొకే అందించి స్వాగతం పలికారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.

ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

రాజధానిలో 70 లక్షలకు పైగా జనాభాను అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారానికల్లా ప్రధాని ప్రణాళిక రానుంది. ఎనిమిది చదరపు కిలో మీటర్ల పరిధిగి సింగపూర్ సహకారం ఉండనుంది. మిగిలిన దశలకు జపాన్, సింగపూర్ సాయం చేయనుంది.

ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

చంద్రబాబు సోమవారం నాడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. మూడు దశల్లో మాస్టర్ ప్లాన్ ఉంటుందని ఈశ్వరన్ చెప్పారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

రాజధాని అభివృద్ధి బాధ్యత సింగపూర్‌దని, సీఆర్డీఏ పరిధి అభివృద్ధి బాధ్యత జపాన్ సంస్థదని చంద్రబాబు చెప్పారు. ఫిబ్రవరిలో తొలి దశ, ఏప్రిల్ నెలాఖరులో రెండో దశ, జూన్ మొదటి వారంలో మూడో దశ ఉంటుంది.

ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

ప్రపంచస్థాయి నగరంగా డిజైన్ చేయనున్నారు. జూరాంగ్, సుహానా సంస్థలకు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు ఇచ్చారు. ఈశ్వరన్‌తో చంద్రబాబు దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను మూడు దశల్లో రూపొందించి ఇస్తామని, ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్‌ కేపిటల్‌ ఉంటుందని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ తెలిపారు

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి పక్షం ముగిసే సమయానికి తొలి దశ, ఏప్రిల్‌ నెలాఖరుకు రెండో దశ, జూన్‌ మొదటి వారానికి మూడో దశ ప్లాన్‌లు సిద్ధం చేసి ఇస్తామని వెల్లడించారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

ఆదివారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్న ఈశ్వరన్‌ బృందం సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయింది.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్‌ కేపిటల్‌లో భవన నిర్మాణాలు, మొత్తం రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ రూపురేఖలు, ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దడం, పారిశ్రామిక అభివృద్ధి, ఆదాయ వనరులను సృష్టించడం తదితర అంశాలపై సమగ్రంగా, సుదీర్ఘంగా చర్చించారు.

ఏపీ రాజధాని

ఏపీ రాజధాని


అనంతరం చంద్రబాబుతో కలిసి ఈశ్వరన్‌ విలేకరులతో మాట్లాడారు. తమ మాస్టర్‌ ప్లాన్‌ ఎలా ఉందనే అంశంపై ఏపీ ప్రభుత్వానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చామని చెప్పారు.

ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

చంద్రబాబుతో తమకు ఎంతో కాలంగా ఉన్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకుని, నూతన రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు అంగీకరించామన్నారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

ఏపీ, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య ఎంవోయూలు కుదుర్చుకున్నామన్నారు. ఈ ఒప్పందాల్లో భాగంగా జురాంగ్‌, సుహానా సంస్థలకు మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన బాధ్యతను అప్పగించామని ఈశ్వరన్‌ వివరించారు.

ఏపీ రాజధాని

ఏపీ రాజధాని


సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. స్మార్ట్‌ సిటీల ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయడం.. అంతలోనే చంద్రబాబు తమ దేశానికి వచ్చి రాజధాని నిర్మాణానికి డిజైన్‌ చేయాల్సిందిగా కోరడంతో తాము ఉత్సాహం చూపించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+