పార్టీ నేతలతో సమావేశమైన బాబు, బెజవాడ పోలీసుల 'ఫోర్త్ లయన్'
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. త్వరలో ఏపీలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని రెండు స్ధానాలకు అన్నం సతీష్, దాసరి రాజా మాస్టర్, మన్నవ సుబ్బారావు, చందూ సాంబశివరావు, కోవెలమూడి రవీంద్ర, రాయపాటి శ్రీనివాస్ పేర్లు పరిశీలిస్తున్నారు.

ఇక విశాఖపట్నంలో జరగనున్న రెండు స్ధానాలకు పప్పుల చలపతి రావు, కన్నబాబు రాజు, రమానాయుడు పేర్లు పరిశీలిస్తున్నారు. విజయనగరంలోని ఒక స్ధానానికి గాను తెంటు లక్ష్మం నాయుడు, జగదీశ్ పేర్లను పరిశీలిస్తున్నారు.
ఫోర్త్ లయన్ మొబైల్ యాప్‌ని విడుదల చేసిన విజయవాడ పోలీసులు:
ప్రజల రక్షణ కోసం విజయవాడ పోలీసులు ఫోర్త్ లయన్ మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తెస్తున్నారు. నేరం జరిగిన వెంటనే పోలీసులకు, ఆప్తులకు సమాచారం అందించే లక్ష్యంతో ఈ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ యాప్ పేరు ఫోర్త్ లయన్. ఇంటర్నెట్ ఆధారంగా మొబైల్‌లో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రజలు పోలీసుల సహాయం పొందనున్నారు. మెట్రో నగరాల తరహాలో ప్రజలు, వాహనదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ సహాయం అందించే లక్ష్యంతో ఈ యాప్‌ను తయారు చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఇన్నోవా బీభత్సం: ఒకరు మృతి
తూర్పుగోదావరి జిల్లా రంగం పేట మండలం వడిశలేరు వద్ద గురువారం సాయంత్రం ఇన్నోవా బీభత్సం సృష్టించింది. ఈ బీభత్సంలో ఇన్నోవా కారు మూడు వాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications