జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు చెప్పిన పిట్టకథ ఇదే
అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు తమ బాధ్యతలను గుర్తు చేసే ప్రయత్నంలో ఓ పిట్టకథ చెబుతూ అందరినీ ఆకట్టుకున్నారు.
'ఒక పక్షి రోడ్డు మీద కాళ్లు పైకెత్తి పడుకుని ఉంది. అటుగా వెళుతున్న ఒక గుర్రం ఎందుకు కాలెత్తి పడుకుని ఉన్నావు అని అడిగింది. దానికి పక్షి ఆకాశం భూమి మీదకు పడిపోతోంది అందుకే దానిని ఆపడానికి నా కాళ్లు అడ్డం పెట్టాను అని చెప్పింది పక్షి. దీనికి గుర్రం నువ్వు కాళ్లతో ఆపితే ఆకాశం ఆగిపోతుందా అంది. నావి చిన్న కాళ్లే కాదని ఆపకుండా చూస్తూ ఉంటే దానిని ఎవరూ అడ్డుకుంటారని పక్షి చెప్పింది. ఇలా ఎవరి కర్తవ్యాన్ని వారు నెరవేర్చితే సమాజం బాగుంటుంది.' అని చంద్రబాబు చెప్పారు.
మరోవైపు ఇదే జన్మభూమి కార్యక్రమంలో ఓ అపురూప సన్నివేశం చోటు చేసుకుంది. తెనాలి టౌన్‌కు చెందిన అత్తలూరి ద్రాక్షాయణి అనే వృద్ధురాలు అమరావతి నిర్మాణానికి రూ.2లక్షలు విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీని ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి తనవంతుగా సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ద్రాక్షాయణి చేసిన సహాయానికి చంద్రబాబు ముగ్ధుడయ్యారు. వెంటనే ఆమెను హత్తుకుని పాదాభివందనం చేశారు.
ఈ సన్నివేశం అక్కడుకున్న ప్రతిఒక్కరినీ హత్తుకుంది. అయితే ఆమె తన పేరు చెప్పుకునేందుకు, ఫోటో దిగేందుకు కూడా నిరాకరించింది. 'మీరు చేసిన సాయం అందరికీ ఆదర్శం కావాలి' అని చంద్రబాబు చంద్రబాబు ఒత్తిడి చేయడంతో ఆమె ఫొటో దిగారు. అనంతరం ఆమెను చంద్రబాబు నాయుడు సన్మానించారు.












Click it and Unblock the Notifications