కులాన్ని అంటగడుతారా, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే, జ్యూరీ నిర్ణయమే: బాబు సంచలనం

ఇలా జరుగుతోందని భావిస్తే ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించి నంది అవార్డులను ఇచ్చేవారమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.

అమరావతి: ఇలా జరుగుతోందని భావిస్తే ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించి నంది అవార్డులను ఇచ్చేవారమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ ప్రముఖుల నుండి వస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు.

Recommended Video

    Nandi Awards Controversy : మా చిరంజీవి అంటే మీకే నష్టం, కాపుల కడుపు నిండదు

    ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ళ కోసం ఇటీవల నంది అవార్డులను ప్రకటించారు. అయితే ఈ అవార్డులపై విమర్శలు వెల్లువెత్తాయి.రుద్రమదేవి సినిమాకు అవార్డు దక్కకపోవడం పట్ల దర్శకుడు గుణ శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    తన సినిమాకు పన్ను మినహయింపు ఇవ్వకుండా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు ఎలా పన్ను మినహయింపు ఇస్తారని ప్రశ్నించినందుకే అవార్డు దక్కలేదనే అభిప్రాయాన్ని గుణశేఖర్ వ్యక్తం చేశారు.గుణశేఖర్‌కు తోడుగా మరికొందరు సినీ ప్రముఖులు కూడ నంది అవార్డులపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిపి స్ట్రాటజీ కమిటీ సమావేశంలో స్పందించారు.

     ఐవీఆర్ఎస్ ద్వారా అవార్డులు

    ఐవీఆర్ఎస్ ద్వారా అవార్డులు

    ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై విమర్శలు వస్తాయని తెలిస్తే ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించి నంది అవార్డులను ఇచ్చేవారమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏ సినిమాకు అవార్డులను ఇవ్వాలని కోరుకొంటారో ఆ సినిమాకే అవార్డులు ఇచ్చేవారమని చంద్రబాబునాయుడు అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే అవార్డుల విషయంలో విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ విమర్శలతో కలత చెందానని బాబు వ్యాఖ్యానించారు.

     అవార్డులకు కూడ కులాన్ని ఆపాదిస్తారా

    అవార్డులకు కూడ కులాన్ని ఆపాదిస్తారా

    అవార్డులకు కూడ కులాన్ని ఆపాదిస్తారా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. నంది అవార్డులను ఒకే కులానికి ఇచ్చారనే ఆరోపణలను కొట్టిపారేశారు. అంతేకాదు అవార్డులు రాకపోతే ఈ రకంగా విమర్శలు చేయడం సరికాదని బాబు అభిప్రాయపడ్డారు. ప్రతి అంశాన్ని కులానికి అంటగట్టి విమర్శలు చేయడంలో అర్ధం లేదని చంద్రబాబు చెప్పారు.

    జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులు

    జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులు


    నంది అవార్డుల కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ నిర్ణయం మేరకే అవార్డులు ఇచ్చామని చంద్రబాబునాయుడు చెప్పారు. మూడేళ్ళ అవార్డులు ఒకేసారి ఇవ్వడం వల్ల కూడ విమర్శలకు తావిచ్చినట్టైందని ఆయన అభిప్రాయపడ్డారు.భవిష్యత్తులో ఈ రకంగా విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు చెప్పారు చంద్రబాబునాయుడు. అయితే ఎందుకు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారోనని ఆయన చెప్పారు.

    భవిష్యత్‌లో ఐవిఆర్ఎస్ ద్వారా అవార్డులు

    భవిష్యత్‌లో ఐవిఆర్ఎస్ ద్వారా అవార్డులు

    భవిష్యత్‌లో నంది అవార్డుల కోసం అవసరమైతే ఐవిఆర్ఎస్ ప్రక్రియను ప్రాతిపదికన తీసుకొనే అవకాశం లేకపోలేదని టిడిపి వర్గాలంటున్నాయి. జ్యూరీ సూచనల మేరకే ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రజల నుండి నేరుగా సమాచారాన్ని తెలుసుకొనేందుకు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంభిస్తే ఎలా ఉంటుందనే చర్చ టిడిపి వర్గాల్లో ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+