వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి గంటాపై బాబు అసంతృప్తి, ఇదీ జరిగింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

AP CM angry on Education and health Departments మంత్రి గంటాపై బాబు అసంతృప్తి | Oneindia Telugu

అమరావతి: సమర్థవంతంగా పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లను, మంత్రులను హెచ్చరించారు. రాష్ట్రంలో విద్య‌, వైద్య ఆరోగ్య‌ రంగాల‌కు నిధులు కేటాయిస్తున్నా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌క‌పోవ‌డంపై సీఎం చంద్ర‌బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

లగడపాటి సర్వే: 2019లో టిడిపి గెలుపు ప్లాన్ ఇదేలగడపాటి సర్వే: 2019లో టిడిపి గెలుపు ప్లాన్ ఇదే

గురువారం నాడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కొందరు కలెక్టర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని శాఖల తీరుపై చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైద్య‌, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, పట్టణాభివృద్ధి, పురపాలక, వృత్తి నైపుణ్యం తదితర శాఖలపై సీఎం అధ్యక్షతన కీలక చ‌ర్చ జ‌రిగింది. సమర్థవంతంగా పనిచేయకపోతే చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు.

కలెక్టర్లు, మంత్రుల పనితీరుపై బాబు అసంతృప్తి

కలెక్టర్లు, మంత్రుల పనితీరుపై బాబు అసంతృప్తి

శుక్రవారం నాడు కలెక్టర్ల రెండో రోజు సదస్సులో కలెక్టర్ల సమావేశంలో విద్య, వైద్య, ఆరోగ్య శాఖలు ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. అహాలు వీడి స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. నాయ‌క‌త్వం స‌రిగ్గా ఉంటే ఈ త‌ర‌హా ఇబ్బందులు ఉండ‌వంటూ ఆయా శాఖ‌ల మంత్రులను ప‌రోక్షంగా మంద‌లించారు.

బయో మెట్రిక్ విధానం అమలులో నిర్లక్ష్యంపై బాబు ఆగ్రహం

బయో మెట్రిక్ విధానం అమలులో నిర్లక్ష్యంపై బాబు ఆగ్రహం

బయో మెట్రిక్ విధానం అమలులో తాత్సారంపై ఆయ‌న మండిప‌డ్డారు. మంత్రి గంటా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా వ్యవస్థ సరిగా పనిచేయటం లేద‌ని, ఎన్ని సార్లు చెప్పినా ఆ శాఖ తలకెక్కించుకోకపోవటం సరికాదని సీఎం ఆక్షేపించిన‌ట్టు స‌మాచారం. లంచాలు తీసుకొనే అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో నిర్మొహ‌మాటంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు.

ప్రజలకు న్యాయం జరిగేదిలా

ప్రజలకు న్యాయం జరిగేదిలా

ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. . క‌లెక్టర్లు త‌మ ఈగోలు, అహంకారాన్ని ప‌క్క‌న‌బెట్టి ప్ర‌జా సంక్షేమం కోసం ప‌నిచేయాల‌ని దిశానిర్దేశం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో వివిధ సంక్షేమ భవనాల ఏర్పాటు లో జాప్యం వద్దని ముఖ్యమంత్రి సూచించారు. కాపు, బీసీ ఇతరత్రా సంక్షేమ భవనాల ఏర్పాటు కు అవసరం మేర స్థలాలు ఇవ్వాల‌ని అధికారులను ఆదేశించారు.

 కొత్త టో‌ల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన చంద్రబాబు

కొత్త టో‌ల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన చంద్రబాబు

ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సరికొత్త టోల్‌ఫ్రీ నెం. 181 ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫనెన్స్‌లో లాంఛనంగా ప్రారంభించారు. గృహహింస, ఈవ్‌టీజింగ్‌ ఇతరత్రా ఎలాంటిఫిర్యాదులనైనా 181 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే తక్షణం బాధితులను ఆదుకొనేందుకు రూపొందించారు. అక్టోబర్ 2 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇళ్లలోసామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు.

English summary
Ap chief minister angry on education and health department department officers in collectors conference.Ap governament held collectors meeting at Vijayawada on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X