కావాలని పైప్ తొలగించారని చెప్పలేం: 'జగన్ చాంబర్లోకి నీళ్లు' సిఐడి చీఫ్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: నూతన అసెంబ్లీలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ కార్యాలయంలోకి నీళ్లు రావడంపై ఏపీ సిఐడి చీఫ్ ద్వారకా తిరుమల రావు మంగళవారం నాడు స్పందించారు.

జగన్ కార్యాలయంలో లేదా అసెంబ్లీ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని తేలిందని చెప్పారు. అలాగే, ఎవరో కావాలని పైపు తొలగించారని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఈ అంశంపై దర్యాఫ్తు ఇంకా పూర్తి కాలేదని, కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

AP CID chief responds on water into YS Jagan chamber

మరోవైపు, అగ్రిగోల్డ్‌, అక్షయ గోల్డ్‌కు సంబంధించిన పలు ఆస్తుల వేలం ప్రక్రియకు సంబంధించి సీఐడీ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులను హైకోర్టు ఆదేశాల మేరకు వేలం వేసేందుకు సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు ఏర్పాట్లు చేశారు.

వాటి ఆస్తులను ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంలో పాల్గొనాలనుకునేవారు ఈ నెల 19వరకు, అక్షయ గోల్డ్‌కు సంబంధించి ఈ నెల 20లోపు బిడ్‌లు సమర్పించాలని సీఐడీ తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CID chief Dwaraka Tirumala Rao on Tuesday responded on water into YSR Congress Party chief YS Jaganmohan Reddy's chamber.
Please Wait while comments are loading...