Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబును వెంటాడుతున్న అమరావతి

Chandrababu Naidu: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. అమరావతి భూ కుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది. ఈ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనపై తాజాగా ఛార్జిషీట్‌పై ఫైల్ చేశారు.

2014- 2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి పరిధిలో అసైన్డ్ భూముల కుంభకోణానికి తెర తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటి విలువ 4,400 కోట్ల రూపాయలు. సుమారు 1,100 ఎకరాల మేర అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

AP CID filed charge sheet against TDP Chief Chandrababu Naidu

జీవో నంబర్ 41ని జారీ చేయడం ద్వారా ల్యాండ్ పూలింగ్ పథకం కిందమందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం.. వంటి గ్రామాల్లో 1,100 ఎకరాల మేర సమీకరించారని సీఐడీ అధికారులు తమ ఛార్జిషీటులో పొందుపరిచారు. కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కేవీపీ అంజనీ కుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం తదితరులు బినామీలుగా వ్యవహరించినట్లు తెలిపారు.

ఈ ఛార్జిషీటులో చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వంలో మున్సిపల శాఖ మంత్రిగా పని చేసిన పొంగూరు నారాయణ, రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం మాజీ తహశీల్దార్ అన్నె సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీపీ అంజనీ కుమార్ అలియాస్ బాబీపై పేర్లు ఉన్నాయి.

మంగళగిరిలోని ఏపీ సీఐడీ పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. సీఆర్ నంబర్ 14/2020, సీఆర్ నంబర్ 15/2020, ఐపీసీ సెక్షన్‌లోని 420, 409, 506, 166, 167, 217, 109 సెక్షన్ల కింద చంద్రబాబు సహా మిగలిన వారిపై కేసులు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ.. ఈ కేసు తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+