టీడీపీ కీలక నేతకు సీఐడీ నోటీసులు -6న విచారణ..!!
టీడీపీ కీలక నేతకు కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. విశాఖ జిల్లా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు సీఐడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేసారు. విజయ్ హైదరాబాద్ లోని ఇంట్లో ఉన్నారనే సమాచారంతో ఏపీ సీఐడీ అధికారులు అక్కడకు వెళ్లారు. ఇంట్లో విజయ్ లేకపోవటంతో, ఇంట్లో ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6వ తేదీన మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు సైబర్ క్రైమ్ విభాగంలో విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

ఈ నెల 6న విచారణకు రావాలంటూ
విజయ్ పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా చూపించినట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్ కు సంబంధించిన సమాచారం విజయ్ వద్ద ఉందని, ఈ సమాచారంతో విచారణకు రావాలని అధికారులు స్పష్టం చేసారు. గతంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్ లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. విజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు 8వారాల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

సైబర్ క్రైంలో నోటీసులు
ఆ కేసులో టీడీపీకి చెందిన నేతలు ఉన్నారంటూ ఎంపీ మాధవ్ సీఐడీకి ఫిర్యాదు చేసారు. ఆ వీడియో తొలుత విదేశాల నుంచి ఐ టీడీపీ ద్వారా బయటకు వచ్చిందని అప్పట్లోనే అనంతపురం ఎస్పీ వెల్లడించారు. ఇప్పుడు సీఐడీ ఏ కేసులో నోటీసులు ఇచ్చిందనే విషయం అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు అందజేశారు. విజయ్ కు నోటీసులు ఇవ్వటం పైన టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. కుటుంబ సభ్యులు, ఇంట్లో పని చేసే వారి పై బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

లోకేష్ ఆగ్రహం - వదిలి పెట్టమంటూ
నేరాలు - ఘోరాలు చేస్తున్న వైసిపి నేతలకు సన్మానాలు చేసి ప్రభుత్వ పదవులు ఇస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న టిడిపి నేతల పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అయన్నపాత్రుడు గారి కుటుంబాన్ని టచ్ చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టమంటూ లోకేశ్ హెచ్చరించారు. అయితే, ఇప్పుడు సీఐడీ పోలీసులు సైబర్ క్రైం కింద నమోదైన కేసులో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు విజయ్ కు నోటీసుల వ్యవహారంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications