గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటున్న సీఎం చంద్రబాబు

జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు ఆయన పార్టీ గొడ్డలి పార్టీ అని, అది సమాజానికి హానికరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. యాదమర్రి మండలంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ప్రసంగించిన సీఎం, ప్రతిపక్ష పార్టీని తీవ్రంగా విమర్శించారు. 'గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్' అని హెచ్చరించారు.

వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు

చంద్రబాబు మాట్లాడుతూ, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి చూసుకోవడం, అసత్య ప్రచారాలు చేయడం వంటి చర్యలు ఆ పార్టీ స్వభావమని ఆరోపించారు. గతంలో జరిగిన కోడి కత్తి, గులకరాయి సంఘటనలను గుర్తు చేస్తూ, దళిత యువకుడు సుబ్రమణ్యం హత్య వంటి ఘటనలను ప్రస్తావించారు. కుటుంబ బంధాలను కూడా దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని చంద్రబాబు గత పాన్లో జరిగిన దారుణాలను విమర్శించారు.

AP CM Chandrababu criticizes opposition party ycp and targets jagan party as goddali party

ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నామన్న సీఎం

తల్లి, చెల్లెళ్ల ఆస్తులపై కన్నేసి వేధించిన వారు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. తాను ప్రజల సేవకుడినేనని, పెత్తందారుడిని కాదని పేర్కొన్నారు. నిరంతరం కష్టపడి పేదల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.

రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి ఒక ఏఐ డాక్టర్ అందుబాటులో

చంద్రబాబు యాదమర్రి పర్యటనలో భాగంగా కండ్రిక గ్రామంలో సంజీవని పథకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి ఒక ఏఐ డాక్టర్ అందుబాటులో ఉంటాడని చెప్పారు. ఇంటి నుంచే 74 రకాల వైద్య పరీక్షలు చేయించుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. డబ్బు, హోదా కంటే ఆరోగ్యమే ముఖ్యమని గుర్తు చేశారు.

ఏపీలో పర్యాటక పోలీస్.. డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్ వెనుక..
ఏపీలో పర్యాటక పోలీస్.. డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్ వెనుక..

వైసీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు

చిత్తూరు జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం దృష్టి సారించారు. ప్రజల సమస్యలు తీర్చడం, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్ ను టార్గెట్ చేసి చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+