ఏపీలో యువతకు అదిరిపోయే వార్త చెప్పిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు MSMEలు ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈ రంగం దేశ ఆర్థిక వెన్నెముక అని, యువతకు ఉపాధి మరియు వ్యాపార అవకాశాలు కల్పించే ప్రధాన మార్గం అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో పాల్గొన్న చంద్రబాబు

విజయవాడలో నిర్వహించిన 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శించి, స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే రంగం ఎంఎస్‌ఎంఈలే అని తెలిపారు.

AP CM Chandrababu inaugurated MSME Growth Summit and laid foundation for 38 industrial parks

సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ఎంఎస్‌ఎంఈలు వేదిక

మహిళా ఉద్యమకారులు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు చేర్చడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ఎంఎస్‌ఎంఈలు వేదికగా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో కోటి ఎంఎస్‌ఎంఈ యూనిట్లను స్థాపించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఉద్యమకారులకు ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసి పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా అనేక పరిశ్రమలు, స్టార్టప్‌ల మధ్య ఒప్పందాలు కుదిరాయని, ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతం ఇస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.

జూన్ 2న ప్రజలకోసం భారీ కానుక ఇస్తున్న రేవంత్ సర్కార్.. తెలంగాణా అంతా పండుగే!
జూన్ 2న ప్రజలకోసం భారీ కానుక ఇస్తున్న రేవంత్ సర్కార్.. తెలంగాణా అంతా పండుగే!

ఎంఎస్‌ఎంఈ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

యువత మరియు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేపట్టేలా ప్రభుత్వం అన్ని వనరులు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+