అసూయగా ఉందంటున్న ఏపీ సీఎం చంద్రబాబు.. రీజన్ అదే !
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
దుబాయ్‌ను చూసి అసూయ..
ఎడారి ప్రాంతాన్ని స్వర్గంగా మార్చిన దుబాయ్ అభివృద్ధి చూసి అసూయగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎండ, ఎడారి వాతావరణం ఉన్నప్పటికీ బీచ్‌లు, టూరిజం వనరులను అత్యద్భుతంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. ఏపీని కూడా అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మారుస్తామన్నారు.

అలానే ఇండియాను ఎవరూ వ్యాపార పరంగా విస్మరించలేరని సీఎం తెలిపారు. డెమోగ్రఫిక్ డివిడెండ్, మేధా శక్తి, మార్కెట్ వంటి అంశాలు భారత్ కి ఉన్న అడ్వాంటేజెస్ అంటావు వివరించారు. యూఏఈ జనాభాలో 40 శాతం భారతీయులే ఉండటం గర్వకారణమన్నారు. 2024-25లో UAE-India మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరిందని.. భారత్ 2047 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో WhatsApp గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 575 సర్వీసులు అందుతున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 నాటికి ఇది 100 శాతానికి చేరుతుందని చెప్పారు. ఏ సేవకైనా ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. అన్ని సేవలు డిజిటల్‌గా అందుబాటులోకి వస్తాయని.. జనవరి 1, 2026 నాటికి ఏపీ నుంచి మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ పని ప్రారంభిస్తుందని ప్రకటించారు.
2019-24 మధ్య లూలు సంస్థని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించలేక పోయాం. కారణాలు ఏంటో ఇక్కడ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగానే, మమ్మల్ని ఆహ్వానించారు. త్వరలోనే విశాఖలో మా సంస్థ పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా 8 వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి :… pic.twitter.com/sTCibS4W0A
— Telugu Desam Party (@JaiTDP) July 23, 2025
ఇక లూలూ గ్రూప్ సంస్థను ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు ఆహ్వానించారు. విశాఖ, అమరావతిలో హైపర్ మాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. మన రాష్ట్రానికి 1,000 కిలోమీటర్ల తీర రేఖ ఉండడం కలిసొచ్చే అంశం అన్నారు. పాపికొండలు, అరకు వ్యాలీ, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కూడా దృష్టి సారించామన్నారు.
విశాఖలో గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటాసెంటర్ నిర్మాణానికి సిద్ధమవుతోందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్, హైడ్రోజన్ ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్రంలో తొలి హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సదస్సులో ఇన్వెస్టోపియా సీఈఓ జీన్ ఫేర్స్, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీని పెట్టుబడుల గేట్వేగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ సమ్మిట్ జరిగింది.












Click it and Unblock the Notifications