హోదా ఎఫెక్ట్: విభజనపై బీజేపీ వైపు చంద్రబాబు వేలు, తెలంగాణతో..

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన విషయంలో ఆయన బీజేపీ వైపు కూడా వేలు చూపించారు. విభజనలో పరోక్షంగా, ప్రత్యక్షంగా బీజేపీ పాత్ర ఉందని అన్నారు.

ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపిలు కలిసి రాష్ట్రాన్ని విభజించాయన్నారు. విభజనకు పరోక్షంగా, ప్రత్యక్షంగా బీజేపీ కూడా కారణమన్నారు.

Also Read: బీజేపీకి షాక్: కేవీపీ హక్కుల నోటీసు, హాల్లో జైట్లీ రహస్యం చెప్పారని జైరాం

ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర హామీల విషయంలో ఇరు పార్టీలు కలిసి చర్చించుకొని తమకు న్యాయం చేయాలన్నారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. మరోసారి ఇప్పుడు అలాంటి అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

 AP CM Chandrababu interesting comments on state division and BJP

అలాగే, తెలంగాణ - ఏపీల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినందునే ఏపీ అవతరణ దినోత్సవాలు జరుపుకోవడం లేదని చెప్పారు. విభజన సమయానికి రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చెప్పారు.

Also Read: మోడీకి చంద్రబాబు ఝలక్: ఆ కొలికి, కేవీపీ బిల్లుపై బీజేపీ వ్యూహం

దానిని భర్తీ చేయాలన్నారు. మా పార్టీ నెరవేర్చే హామీలకు, ఏపీకి కేంద్రం హామీలకు సంబందం లేదన్నారు. ఏపీ ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఊతమివ్వాలన్నారు. పట్టిసీమ ద్వారా నదులను అనుసంధానం చేయగలిగామన్నారు.

నదులను పూజించడం, ప్రేమించడం మన సంప్రదాయం అన్నారు. నదుల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకే కృష్ణా పుష్కరాలు అన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతం పెంచడమే లక్ష్యమన్నారు. గోదావరి పవిత్ర సంగమంతో కృష్మమ్మ కొత్త రంగులో కనిపిస్తోందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu interesting comments on state division and BJP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి