Chandrababu Security: చంద్రబాబుకు తగ్గిన భద్రత? కొత్తగా డ్రోన్లు..కారణమిదే..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భద్రతలో మార్పులు చేసుకున్నారు. తాజాగా ఆయన యాక్టివిటీ బాగా పెరగడం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా భద్రతలోనూ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తనకున్న భద్రతా సిబ్బందిని బాగా తగ్గించినట్లు తెలుస్తోంది. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్నప్పటికీ ఆయన రక్షణ వలయం పరిమితంగానే ఉంటుండటం విశేషం.

ప్రస్తుతం చంద్రబాబు భద్రత కోసం కేవలం 121 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. గత సీఎం జగన్‌తో పోలిస్తే ఎనిమిదో వంతు సిబ్బందే ఇప్పుడు విధుల్లో ఉంటున్నారు. నివల్ల భద్రతాపరమైన ఖర్చు కూడా భారీగా తగ్గిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో జగన్‌ కాన్వాయ్‌లో 17 వాహనాలు ఉండగా ఇప్పుడు చంద్రబాబు కాన్వాయ్ లో 11 మాత్రమే ఉన్నాయి. కావాలనే ఇలా భద్రతను చంద్రబాబు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

ap cm Chandrababu made big changes in his security- here are details

అయితే భద్రతా సిబ్బంది స్ధానంలో డ్రోన్లను చంద్రబాబు సెక్యూరిటీలో చేర్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు స్వయంగా తన భద్రతకు సాంకేతిక పరిజ్ఞానం జోడించాలని అధికారులకు చెప్పడంతో పోలీసులు డ్రోన్లను వాడుతున్నట్లు సమాచారం. దీంతో తక్కువ సిబ్బందితోనే భద్రత కల్పిస్తున్నారు. చంద్రబాబు సెక్యూరిటీ కవర్ లో చేరిన డ్రోన్‌ ప్రతి రెండు గంటలకు ఒకసారి పైకి ఎగిరి చుట్టూ ఉన్న పరిస్థితులను వీడియో తీస్తోంది. ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే పర్యవేక్షక విభాగానికి సమాచారం వెళ్తుంది. అలాగే డ్రోన్‌ నిర్దేశిత సమాయానికి తానే ఎగిరి నిర్దేశిత ప్రాంతంలో తిరిగి వచ్చాక స్వయంగా చార్జింగ్‌ అవుతోంది.

జిల్లాల టూర్లలోనూ చంద్రబాబు భద్రతను పరిమితం చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా భద్రతను పరిమితంగానే ఉంచాలని, ఎలాంటి హడావిడి వద్దని అక్కడికక్కడే చెప్పేస్తున్నారు. తాజాగా చంద్రబాబు పోలవరం టూర్ లోనూ ఎక్కువ భద్రతా సిబ్బంది వద్దని చంద్రబాబు చెప్పారు. అలాగే రోడ్లపై తాను వెళ్లేటప్పుడు సైతం ట్రాఫిక్‌ను గంటల తరబడి ఆపవద్దని, బాగా దగ్గరకు వచ్చినప్పుడు కాసేపు ఆపాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+