సీఎం చంద్రబాబు సంపాదన 25 వేల కోట్లు?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుండి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పథకాల అమలు కోసం ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. చంద్రబాబు తలకు మించిన హామీలు ఇచ్చారని. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని ,చంద్రబాబు ఇస్తానని చెబుతున్న పథకాలు అమలు చేయాలంటే ఆర్బిఐనే ఏపీలో ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఆర్ధిక శాఖపై చంద్రబాబు ఫోకస్
ఏపీలో సూపర్ సిక్స్ పథకాల అమలు సాధ్యం కాదని వైసీపీ నేతలు తేల్చి చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ఉన్న అవకాశాలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? అవుతున్న ఖర్చు ఎంత? అనేదానిపై ఆర్థిక శాఖ అధికారులతో లెక్కలు పక్కాగా తెలుసుకున్నారు.

25 వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్
ప్రతి సంవత్సరం 25 వేల కోట్ల మేరకు లోటు బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్క తేల్చారు. ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి ఉంటుందని అలా చేయగా మరో 25 వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ కనిపిస్తుందని వారు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
వైసిపి ప్రభుత్వం సంక్షేమానికి 70వేల కోట్ల ఖర్చు
ఏపీకి వస్తున్న ఆదాయంలో ముఖ్యంగా సామాజిక భద్రత పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు పోగా ప్రభుత్వ అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లింది. వస్తున్న ఆదాయానికి ఉన్న ఖర్చుకు అసలు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. గతంలో వైసిపి ప్రభుత్వం 70వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి వెచ్చించినట్టు ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
అదనంగా 25 వేల కోట్లు కావాలన్న ఆర్ధిక శాఖ
అయితే గతం కంటే చంద్రబాబు ఎక్కువ సంక్షేమ పథకాల హామీ ఇవ్వడంతో ఇప్పుడు సంక్షేమానికి 90 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబుకు చెప్పారు. సర్కార్ కి వచ్చే ఆదాయం పోగా, 50 వేల కోట్లు అప్పులు చేసిన ఇంకా మరో 25వేల కోట్ల రూపాయలు ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడానికి అవసరమవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబుకు వెల్లడించినట్లు సమాచారం.
ఆదాయంపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్
దీంతో చంద్రబాబు 25 వేల కోట్ల సంపద సృష్టించడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తే రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ ఆదాయం పెరుగుతుందని, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఐరన్, సిమెంట్, ఇతర వ్యాపారాల ద్వారా పన్నుల రూపంలో సర్కారుకు కొంత ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
సంపద సృష్టిపై చంద్రబాబు ఫోకస్
అలాగే ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సంపదను సృష్టించడానికి కృషి చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సూపర్ సిక్స్ పథకాల అమలుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్న చంద్రబాబు ఇందులో ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications