బీజేపీ గెలుపుపై బాబు స్పందన: కాంగ్రెస్‌పై నితీష్ ఆసక్తికరం, 'రాహుల్‌కు తొలి ఇన్నింగ్స్‌లో సున్నా'
Recommended Video

అమరావతి: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఆయన స్పందించారు. బీజేపీ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీని అభినందిస్తున్నానని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతకుముందు కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి కూడా శుభాకాంక్షలు తెలిపారు.

పళనిస్వామి, స్టాలిన్ శుభాకాంక్షలు
బీజేపీ గెలుపుపై పలువురు అబినందనలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా బీజేపీకి కంగ్రాట్స్ తెలిపారు. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

నిర్మలా, జైట్లీ థ్యాంక్స్
గుజరాత్ కార్యకర్తలకు అభినందనలు అని, మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న అజెండా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని, రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీజేపీపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు అని నిర్మలా సీతారామన్ అన్నారు.

నితీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
వరుసగా ఆరోసారి గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీకి అభినందనలు అని, బీజేపీపై నమ్మకం ఉంచిన హిమాచల్ ప్రజలకు ధన్యవాదాలు అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో గెలిచిన మోడీ, బీజేపీకి అభినందనలు అని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసించారు. బీజేపీ నుంచి అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని, కానీ హిమాచల్లో అధికారం కోల్పోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ సున్నా.. పారికర్
గుజరాత్ వాసులు మళ్లీ అభివృద్ధికి పట్టం కట్టారని, దేశానికి బీజేపీ తప్ప మరో దారి లేదనేందుకు ఇదే నిదర్శం అని రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే అన్నారు. రాహుల్ అధ్యక్షుడిగా తొలి ఇన్నింగ్స్‌లో సున్నా స్కోర్ సాధించారని గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications