అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1978 నుంచి ఇక్కడ ఉంటున్నా: మండలిలో చంద్రబాబు స్వీట్ మెమొరీస్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: వర్షాకాలపు సమావేశాల్లో చివరి రోజైన శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్తంత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన తొలినాళ్లలో తన ప్రచారం అంతా ఎస్వీ యూనివర్సిటీ నుంచి సాగిందని చెప్పుకొచ్చారు.

ఇప్పుడే పాత అసెంబ్లీ బిల్డింగ్‌ను ఒకటి రెండు సార్లు చూసుకుని వచ్చానని అన్నారు. మొదటి సారి వచ్చి ఎక్కడ కూర్చున్నానో చూసుకొని వచ్చాన్నారు. శాసన మండలిలోకి సినిమాటోగ్రఫీ మంత్రిగా తొలిసారి 1980లో వచ్చానని అన్నారు. నాకు ఇప్పటికీ కూడా జ్ఞాపకం ఉందని చెప్పారు.

అలాంటి రాజకీయం జీవితం ప్రారంభమైన తాను హైదరాబాద్ సిటీతో 38 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఇంకా రెండేళ్లు అయితే నలభై సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. 1978 నుంచి ఇక్కడ ఉంటున్నానని చెప్పారు. ఆరోజు నుంచి ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటే, ఈ బిల్డింగ్‌లో ఈ కౌన్సిల్ హాలులో చివరి సమావేశాలని నేను అనుకుంటున్నానని చెప్పారు.

 AP CM Chandrababu Naidu emotional Speech at Legislative Council while reacting to Critics

ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప మళ్లీ ఇక్కడికి రాకూడదని నేను అనుకుంటున్నానని అన్నారు. ఇలా పాత గుర్తులన్నీ కూడా ఒకసారి నెమరవేసుకున్నారు. కొంత మంది స్నేహితులు వస్తే ఫోటోలు కూడా తీసుకుని ఒక గుర్తుగా మిగిలిపోయే ఉండే పరిస్థితి వచ్చిందని చెప్పారు.

హైదరాబాద్‌లో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిర్వహించడం ఇవే చివరి సమావేశాలని అన్నారు. వచ్చే సమావేశాలు ఏపీలోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పలువురు ఎమ్మెల్యేలు సెల్పీలు తీసుకున్నారు.

అంతక ముందు హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో నాపై చాలా విమర్శలు చేశారని అన్నారు. తెలుగువారికి మంచి రాజధాని ఉండాలనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు. మండలిలలో మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు.

తనను చెప్పుతో కొడతానని కొందరు అన్నారని, మంచిపనులు చేసినప్పుడు ఇలాంటి మాటలు తప్పవని చంద్రబాబు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మాటకు బాధపడినా మనసులో పెట్టుకున్నానన్నారు. ఇరవయ్యేళ్లుగా తనను భగవంతుడు నడిపిస్తున్నాడని చంద్రబాబు అన్నారు.

English summary
AP CM Chandrababu Naidu emotional Speech at Legislative Council while reacting to Critics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X