నదీ ముఖంగా ఏపీ రాజధాని: సాగర్ అందంపై బాబు
హైదరాబాద్: కృష్ణా నదికి ఇరువైపులా అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచేలా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు.
విజయదశమి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం గం. 2.25 నిమిషాలకు ఏపీ సచివాలయంలోని ఎల్ బ్లాకు 8వ అంతస్తులో నూతనంగా తీర్చిదిద్దిన ఛాంబర్ నుండి ఆయన కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఛాంబర్ నుండి హుస్సేన్ సాగర్ అందంగా కనిపిస్తోందని విలేకరులు అన్నారు. దానికి చంద్రబాబు ఆయన అంగీకరించారు. కృష్ణానది ఒడ్డున నిర్మించి ఏపీ రాజధానిలో ఇంతకంటే అద్భుతమైన దృశ్యం ఉంటుందన్నారు. కృష్ణా నదిలో సుమారు 20 నుండి 30 కిలోమీటర్ల పొడవున ఒకస్థాయి వరకు ఎప్పుడు నీరు ఉండేలా చూస్తామన్నారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబునాయుడు పదేళ్ల తరువాత సచివాలయంలోని సీఎం కార్యాలయంలోకి ప్రవేశించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఎల్‌బ్లాక్‌లోని సీఎం కార్యాలయంలోకి చంద్రబాబు అడుగుపెట్టారు.

చంద్రబాబు
వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, సీఎస్ ఐవైఆర్‌కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకుడు మురళీకృష్ణ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు.

చంద్రబాబు
ఇక నుంచి సచివాలయం నుంచి బాధ్యతలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. లేక్‌వ్యూ క్యాంప్ ఆఫీస్‌గా ఉంటుందని, అప్పుడప్పుడు లేక్‌వ్యూ నుంచి కూడా విధులు నిర్వహించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని పాలన కొనసాగిస్తూ వస్తున్నారు.

చంద్రబాబు
సచివాలయంలోని ఎల్‌బ్లాక్‌ను ఏపీకి కేటాయించడంతో ఏడో అంతస్థులో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రూ.10 కోట్లతో పూర్తి హైటెక్ హంగులతో బుల్లెట్ ప్రూఫ్ విధానంలొ ఈ ఛాంబర్‌ను తీర్చిదిద్దారు. చాంబర్‌లోకి అడుగిడిన సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications