ఏపీలో రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి 2019 వరకు తాము అధికారంలో ఉన్న సమయంలో పంటల బీమాకు సంబంధించిన విధానాన్నే మరోసారి అనుసరించబోతోంది. పంటల బీమాకు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానం కాకుండా గత విధానాన్ని అనుసరించాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.
ప్రీమియం అందలేదని టీడీపీ ఆరోపణ
ఈ విధానానికి సంబంధించి వ్యవసాయశాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. వైసీపీ హయాంలో రైతుల పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది. ఈక్రాప్ ద్వారా పంటలను నమోదుచేసి ప్రీమియం చెల్లిస్తూ వచ్చారు. ఈ విషయంలో తప్పులు జరిగాయని, సాంకేతిక కారణాలతో చాలామంది రైతులకు బీమా అందలేదనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ నేపథ్యంలోనే పాత పంటల బీమా విధానాన్ని అనుసరించాలని సీఎం నిర్ణయించారు.

సాగు ఖర్చులు తగ్గించే దిశగా..
వైసీపీ విధానాలవల్ల వ్యవసాయం భారంగా మారిందని, ప్రభుత్వ రాయితీలు, విధానాలద్వారా సాగు ఖర్చు తగ్గించాలనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం గత పాలనలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం రైతులను ప్రోత్సహించబోతోంది. డ్రోన్లతో పురుగుమందులను పిచికారీ చేసే విధానంపై అధ్యయనం చేసి రైతులకు వాటిపై అవగాహన కల్పించనుంది. రైతుల భాగస్వామ్యంతోనే పంటల బీమా విధానాన్ని కొనసాగించనున్నారు. ఐఏఎస్ అధికారుల కూడా పొలాలకు వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడబోతున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో నిర్వహించిన మట్టి పరీక్షలు మళ్లీ కొనసాగించబోతున్నారు. అలాగే రాయితీలద్వారా డ్రిప్పులు కూడా అందజేయనున్నారు.












Click it and Unblock the Notifications