Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

53రోజులు జైలు జీవితం అనుభవించిన కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు క్లీన్ చిట్!

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసిన ఈడి మనీలాండరింగ్ కార్యాకలాపాలలో చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేసింది. తాజాగా దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ లో ఈడి చంద్రబాబును నిందితుడిగా చేర్చలేదు.

చంద్రబాబుకు భారీ ఊరట

ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ సంబంధిత ప్రక్రియలలో చంద్రబాబు పాత్ర లేదని ఈడి ధ్రువీకరించడం ఈ కేసులో చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది. విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడి ఈ సప్లమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసింది . ఈ ఛార్జ్ షీట్ ను జనవరి 28వ తేదీన కోర్టు విచారణకు స్వీకరించగా, ఇందులో చంద్రబాబు పాత్ర లేదని పేర్కొంది.

ap cm chandrababu naidu got clean chit from ed in ap skill development money laundering case

అనుబంధ అభియోగ పత్రాలలో చంద్రబాబు పేరు లేదు

ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన ప్రధాన అనుబంధ అభియోగ పత్రాలలో కూడా చంద్రబాబు పేరు లేకపోవడం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ కేసులో డిజైన్ టెక్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ దాని ఎండి వికాస్ వినాయక్ ఖన్వేల్ఖర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ తదితరులను నిందితులుగా పేర్కొన్న ఈడి చంద్రబాబు ప్రమేయంపై సాక్ష్యాలు లేవని తేల్చిచెప్పింది. ఈడి అధికారిక ప్రకటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

స్కిల్ కేసులో 53 రోజులు చంద్రబాబు జైల్లో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి స్కిల్ కేసులో 2023 సెప్టెంబర్లో చంద్రబాబును నిందితుడిగా చేర్చి అరెస్టు చేసింది. సుమారు 53 రోజులపాటు చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. ఏపీ సిఐడి అధికారులు 2024 ఏప్రిల్ లో విజయవాడ ఏసిబి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసి చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఇక ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు చేసి ఈడికి లేఖ రాశారు.

చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ

ఈ లేఖ ద్వారా రంగంలోకి దిగిన ఈడి కేసును దర్యాప్తు చేసి ఈ కేసులో ఎక్కడ చంద్రబాబు పాత్ర లేదని తాజా అనుబంధ అభియోగ పత్రంలో పేర్కొంది. ఈ కేసులో నిధులు దారి మళ్లింపు వ్యవహారాలలో చంద్రబాబు పాత్ర లేదని చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పటికే జగన్ ప్రభుత్వ హయాంలో సిఐడి కేసులో చంద్రబాబుకు విముక్తి లభించగా, తాజాగా ఈడీ కేసులోనూ చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేయడంతో ఈ కేసు నుండి చంద్రబాబుకు విముక్తి లభించినట్లయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+