సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు అనుకున్న తేదీ కంటే రెండు రోజులు వెనుక అయినప్పటికీ, ఈ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకింత సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక సచివాలయానికి రాకుండా మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే తిష్ఠవేసి మొరాయించిన ఉద్యోగులను ఎట్టకేలకు అమరావతికి తీసుకురావడంతో చంద్రబాబు సఫలమయ్యారు.

వెలగపూడిలోని నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం భవంతిలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఉద్యోగుల రాకతో సచివాలయం ప్రారంభం కావడంతో చంద్రబాబు పరిపాలనపై ఇప్పటివరకూ ఉన్న విమర్శలు కొంతమేరకు తగ్గినట్టుగా కనిపిస్తోంది. రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన ఏపి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించుకోవడానికే రెండేళ్లు పట్టింది.

దీంతో చంద్రబాబు ప్రభుత్వం అనేక ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజధాని అమరావతిలో ఉద్యోగులకు వసతులు సరిగా కల్పించలేదని, హైదరాబాద్ సచివాలయం నుంచి అప్పుడే కదిలేది లేదని కొందరు, వెలగపూడిలో సకలసౌకర్యాలు కల్పించిన తర్వాత వస్తామని మరికొందరు అన్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వం జూన్ 27ని గడువుగా ప్రకటించినప్పటికీ ఉద్యోగులు తరలింపు ప్రక్రియను వాయిదా వేసేందుకు శక్తివంచన లేకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. ఈ విషయంలో చంద్రబాబు సైతం చాలా కఠినంగా వ్యవహరించారు. ఉద్యోగులను వెలగపూడికి రప్పించేందుకు వారానికి ఐదు రోజులే పనిదినాలను చేస్తూ జీవో జారీ చేశారు.

మరోవైపు వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు ఐదుసార్లు బాబు స్వయంగా సచివాలయ నిర్మాణ తీరును పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులు, మంత్రుల చాంబర్ల కోసం తాత్కాలికంగా రెండు భవనాలను త్వరితగతిన నిర్మిస్తే, వాదనలు, చర్చలకు తెరపడుతుందని భావించారు.

ఇందులో భాగంగా మున్పిపల్ శాఖ మంత్రి నారాయణను వ్యక్తిగత పర్యవేక్షణకు నియమించారు. మంత్రి నారాయణ సైతం కార్యదక్షుడి మాదిరి తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తయ్యేందుకు నిర్మాణ సంస్ధలతో దగ్గరుండి మరీ పనులు చేయించారు. అనంతరం హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను మొదలుపెట్టారు.

 సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

తాత్కాలిక సచివాలయం ప్రారంభమైన నేపథ్యంలో ఉద్యోగులు విజయవాడ, మంగళగిరి, గుంటూరులో అద్దె ఇళ్లలో చేరిపోగా, మహిళా ఉద్యోగినులు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో చేరిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరుకు బస్సుల్లో వచ్చిన వారిని, స్థానిక ఉద్యోగులకు ఘనస్వాగతం పలికారు.

సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో, ప్రజల్లో కూడా ‘మన రాష్ట్రంలో మన పాలన' మొదలయిందన్న భావన మొదలైంది. ఉద్యోగులను రాజధానికి తీసుకురావడంతోపాటు, తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో చురుకుగా వ్యవహరించిన బాబు పాలనపై, ఇప్పటివరకూ వివిధ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కూడా చాలావరకూ తొలగినట్టయింది.

సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

పనుల కోసం హైదరాబాద్ వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్న భావన నవ్యాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చేవారికి తప్ప, మిగిలిన జిల్లాల వారంతా విజయవాడకు ఉదయం వచ్చి, రాత్రికి జిల్లాలకు చేరుకునే వెసులుబాటు తరలింపుతో కలిగిందన్న సంతోషం వ్యక్తమవుతోంది.

 సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

ఒక రకంగా ఈ రెండు అంశాల్లో వేగంగా వ్యవహరించి బాబు తనపై ప్రజల్లో నమ్మకం పెంచుకున్నారన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, అమరావతికి శంకుస్థాపన చేసినప్పుడే తాత్కాలిక సచివాలయ నిర్మాణం, ఆ తర్వాత తరలింపు ప్రక్రియ మొదలుపెడితే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

అయితే, హైదరాబాద్‌లో ఉన్న మంత్రులు, ఐఎఎస్, ఐపిఎస్ క్వార్టర్లను ఏమి చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఆగస్టుతో సచివాలయ తరలింపు ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు సచివాలయాన్ని తెలంగాణ సర్కారుకు స్వాధీనం చేయాల్సి ఉంది. మరి అప్పటివరకూ అధికారులు ఉంటున్న క్వార్టర్లు ఖాళీ చేస్తారా? కొనసాగిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు.

 సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

సచివాలయ ప్రారంభం: తగ్గిన విమర్శలు, చంద్రబాబు విజయం సాధించారా?

మరోవైపు ఏపీ అధికారులు క్వార్టర్లు ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇస్తుండగా ఏపీ ప్రభుత్వం మాత్రం తమకు ఏమీ పట్టనట్టు వ్యవహారిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ మంత్రులు, అధికారులకు విజయవాడ సమీపంలోని రెయిన్‌ట్రీ విల్లాల్లో క్వార్టర్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+