వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
chandrababu naidu rahul gandhi andhra pradesh alliance congress telugudesam andhra pradesh assembly elections 2019 చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కాంగ్రెస్ 2019 lok sabha elections
రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ: ఏపీలో పొత్తు, ఇతర అంశాలపై సుదీర్ఘ చర్చ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ఏపీలో పొత్తు, జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. దాదాపు గంటపాటు వారి భేటీ జరిగింది.
అలాగే, ఫిబ్రవరి నెలలో ఏపీ రాజధాని అమరావతిలో భారీ సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు రాహుల్ గాంధీ సహా జాతీయ నేతలకు చంద్రబాబు ఆహ్వానం పలుకుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసినప్పుడు సభకు రావాలని చెప్పారు.

రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఏపీ భవన్‌లో వీరి భేటీ జరిగింది. బీజేపీయేతర కూటమి కోసం ఇటీవల చంద్రబాబు వరుసగా జాతీయ నేతలను కలుస్తోన్న విషయం తెలిసిందే.