అమ్మ దయవల్లే తెలంగాణ: కేసీఆర్, ఇవి కోరుకున్నానని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దయవారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రజలకు అమ్మవారి దయ ఎప్పటికీ ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలను చల్లగా చూడాలని తాను అమ్మవారిని మొక్కుకున్నానని చెప్పారు. వర్షాలు బాగా పడి బాగా పండేలా చూడాలని కోరుకున్నానని తెలిపారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించామని చెప్పారు.

కాగా, అమ్మవారిని ముఖ్యమంత్రి దంపతులు దర్శించుకున్నారు. సీఎం దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కేసీఆర్ దంపతులకు తీర్థప్రసాదాలు అంద జేశారు. కేసీఆర్ సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నిజామాబాద్ ఎంపీ కవిత, తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావు, ఈటెల రాజేందర్‌లు అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షాలు బాగా పడాలని కల్వకుంట్ల కవిత కోరుకున్నారు.












Click it and Unblock the Notifications