వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంపై సీఎం కీలక వ్యాఖ్యలు: వెనుకడుగు లేదంటూనే తగ్గిన చంద్రబాబు!

|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరం ప్రాజెక్టు వివాదం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు పోలవరంపై రాజీపడే ప్రసక్తి లేదని చెబుతూనే మరోవైపు, కేంద్రంతో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంతో రగడ వద్దని ఆయన పార్టీ నేతలకు హితవు పలికారు.

పోలవరం ఎఫెక్ట్: జవాబు చెప్పుకోవాలి.. మోడీ దుమ్ముదులిపిన బాబు, ఆధారాలతో సహా లెక్కలు!పోలవరం ఎఫెక్ట్: జవాబు చెప్పుకోవాలి.. మోడీ దుమ్ముదులిపిన బాబు, ఆధారాలతో సహా లెక్కలు!

పోలవరం ప్రాజెక్టు విషయమై అధికారి నుంచి లేఖ వచ్చిందని, దీనిపై తాను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడుతానని చెప్పారు. బీజేపీ, టీడీపీ దోస్తీలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాదిద్దామని చెప్పారు. వ్యక్తిగతంగా బీజేపీని ఎవరూ ఏమీ అనవద్దని చెప్పారు.

ఏపీలో వేడెక్కిన రాజకీయం: మోడీకి బాబు నమస్కారం! గొడవపడకుండా కేసీఆర్‌తో సిద్ధంఏపీలో వేడెక్కిన రాజకీయం: మోడీకి బాబు నమస్కారం! గొడవపడకుండా కేసీఆర్‌తో సిద్ధం

కేంద్రంలో ఉండే ప్రభుత్వం సాయం అవసరం

కేంద్రంలో ఉండే ప్రభుత్వం సాయం అవసరం

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన ధ్యేయమని చంద్రబాబు చెప్పారు. దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అయితే కేంద్రంలో ఉండే ప్రభుత్వం సాయం మనకు అవసరమని చెప్పారు. కాబట్టి బీజేపీపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయవద్దని నేతలకు సూచించారు. వ్యక్తిగతంగా కూడా కామెంట్లు చేయవద్దని చెప్పారు.

ప్రాజెక్టు విషయంలో వెనుకడుగు లేదు కానీ

ప్రాజెక్టు విషయంలో వెనుకడుగు లేదు కానీ

అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పోలవరం నిర్మాణం ఏపీ అభివృద్ధితో కూడిన అంశమని చెప్పారు. దీనిపై రాజకీయం వద్దని చెప్పారు. పోలవరం నిర్మాణంపై ప్రతి వారం తాను సమీక్ష చేస్తున్నామని చెప్పారు. ఏ మాత్రం అలక్ష్యం వహించినా నిర్మాణం వెనుకబడుతుందన్నారు.

కేంద్రం సాయం అవసరం

కేంద్రం సాయం అవసరం

మనది కొత్త రాష్ట్రం కాబట్టి కేంద్రం సాయం అవసరమని చెప్పారు. ఏపీలో అభివృద్ధికి కేంద్రంలోని ప్రభుత్వం తోడ్పడాల్సి ఉందని చెప్పారు. అదే సమయంలో ఆయన పార్టీ నేతలకు కూడా కొన్ని సూచనలు చేశారు.

రియల్ టైమ్ గవర్నెన్స్, రియల్ టైమ్ పాలిటిక్స్

రియల్ టైమ్ గవర్నెన్స్, రియల్ టైమ్ పాలిటిక్స్

తాను రియల్ టైమ్ గవర్నెన్స్ చేస్తుంటే ఎమ్మెల్యేలు రియల్ టైమ్ పాలిటిక్స్ చేయాలని చంద్రబాబు సూచించారు. కమ్యూనిస్టు పార్టీ వల్ల ఏమీ రాదన్నారు. సంస్కరణలపై ప్రజల ఆలోచన విధానం మారిందని చెప్పారు. దానిక అనుగుణంగా రాజకీయ విధానం మారాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేస్తే అధికారం సుదీర్ఘంగా ఉంటుందన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Polavaram and Central Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X