ఫ్యామిలీతో పాటు మాల్దీవులకు చంద్రబాబు నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి అయిదు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఆయన మాల్దీవుల్లో పర్యటిస్తారు.
ఆయన ప్రతి ఏడాది తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుంటారనే విషయం తెలిసిందే. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ వెళ్లనున్నారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్ తన పర్యటన ముగించుకుని నేరుగా మాల్దీవులు చేరుకోనున్నారు. కుటుంబం ఏపీ నుంచి వెళ్లనుంది.












Click it and Unblock the Notifications