వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2029 దాకా మేమే: జగన్‌కు బాబు ఝలక్, అంతా నంద్యాల జోష్

మరికొన్నేళ్ల పాటు ఏపీలో ఏకపక్ష ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. 2019లోనే కాదని, 2024, 2029లో కూడా టిడిపియే అధికారంలోకి వస్తుందన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: మరికొన్నేళ్ల పాటు ఏపీలో ఏకపక్ష ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. 2019లోనే కాదని, 2024, 2029లో కూడా టిడిపియే అధికారంలోకి వస్తుందన్నారు.

'బిజెపితో టచ్‌లో నేతలు, ఏపీపై మోడీ దృష్టి': బాబుకు షాకిస్తారా?'బిజెపితో టచ్‌లో నేతలు, ఏపీపై మోడీ దృష్టి': బాబుకు షాకిస్తారా?

నల్లేరు మీద నడకే

నల్లేరు మీద నడకే

వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావ‌డం న‌ల్లేరు మీద న‌డ‌కే అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి ప‌థ‌కాలే త‌మ‌కు విజయాన్ని సాధించి పెడతాయని చంద్రబాబు చెప్పారు. విభ‌జ‌న అనంత‌రం చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌నీ, ఒక్కో దాన్నీ అధిగ‌మించుకుంటూ వ‌స్తున్నామ‌నీ, దేశంలోనే అత్యుత్త‌మ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామ‌న్నారు.

ఏం చేయాలో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం

ఏం చేయాలో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం

అన్ని ర‌కాలుగా ఇప్పుడిప్పుడే నిల‌దొక్కుకుంటూ ఉన్నామని చంద్రబాబు అన్నారు. ఈ ద‌శ‌లో టిడిపి నాయకులను ప్ర‌జ‌ల్లోకి పంపించామ‌నీ, ప్ర‌జ‌ల‌తో అనుసంధానం చేయాల‌నే ఉద్దేశంతోనే ఇంటింటికీ టిడిపి చేపట్టామన్నారు. మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఏం చేయాల‌నేది ఈ కార్య‌క్ర‌మం ద్వారా తెలుసుకుంటున్నామ‌న్నారు.

పనికొచ్చే రాజకీయాలు చేయడం లేదు

పనికొచ్చే రాజకీయాలు చేయడం లేదు

మ‌నం మంచి ప‌నులు చేస్తే ప్ర‌జ‌లు మ‌న‌తోనే ఎప్పుడూ ఉంటారని చంద్రబాబు అన్నారు. ఏదో ఒక‌టి చేసి అభివృద్ధిని అడ్డుకోవ‌డ‌మే వైసిపి చేస్తోందని, ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే రాజ‌కీయాలు వీళ్లు చేయ‌డం లేద‌న్నారు.

ఇదంతా నంద్యాల జోష్

ఇదంతా నంద్యాల జోష్

నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఫ‌లితాలు టిడిపికి కొత్త ఉత్సాహం ఇచ్చాయి. నంద్యాల ఎన్నికలకు ముందు టిడిపిలో కూడా కొంత డైలమా కనిపించేది. కానీ అక్కడ గెలిచాక అంతులేని ఉత్సాహం వచ్చింది.

English summary
Though the Assembly elections are a good two years away, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Saturday asserted that he would return to power in 2019 on the strength of the “big achievements” of his government and “virtually no Opposition.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X