అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

5-10-15తో అమరావతి సిద్ధాంతం: చంద్రబాబు, అమరావతి సూపర్: సింగపూర్ మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి/సింగపూర్: ప్రపంచ నగరాల మేయర్స్ ఫోరం సదస్సులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు - నవీన ఆవిష్కరణలపై ఆయన మాట్లాడారు. సింగపూర్ సహకారంతో అమరావతిని నిర్మించుకుంటున్నామని చెప్పారు. విభజన సమస్యల నుంచి బయటపడేందుకు ఏపీ ప్రయత్నిస్తోందన్నారు.

2050 నాటికి ప్రపంచ అత్యుత్తమ గమ్యస్థానంగా మార్చాలన్నదే మా లక్ష్యమని చెప్పారు. రెండెంకల సుస్థిర వృద్ధిని నిలుపుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. నాణ్యమైన విద్యుత్‌తో రాష్ట్రాని తయారీ పరిశ్రమల హబ్‌గా రూపొందిస్తామన్నారు.

AP CM Chandrababu Naidu reached Singapore to attend World Cities Summit

మౌలిక సదుపాయాల కోసం పీపీపీ పద్ధతిలో అనేక సంస్థలతో భాగస్వామ్యమని చెప్పారు. 5-10-15 అమరావతి సిద్ధాంతాన్ని రూపొందించామన్నారు. ఐదు నిమిషాల్లో ఎమర్జెన్సీ, 10 నిమిషాల్లో సోషల్ ఇన్ ఫ్రా, 15 నిమిషాల్లో వాక్ టు వర్క్ అనే కాన్సెప్టు అమలు చేస్తామన్నారు.
అమరావతిలో 9 నగరాలకు అంతర్భాగం చేస్తామన్నారు. అమరావతిలో 30 మిలియన్ చదరపు అడుగుల మేర నిర్మాణపు పనులు ఉంటాయని చెప్పారు.

మంత్రితో చంద్రబాబు భేటీ

చంద్రబాబు సింగపూర్ నేషనల్ డెవలప్‌మెంట్‌ మంత్రి లారెన్స్ వొంగ్‌తో అంతకుముందు సమావేశమయ్యారు. ఉభయ దేశాల మధ్య పరస్పర సహకార సంబంధాలకు ఇదొక మంచి అవకాశమని చంద్రబాబు అన్నారు. ప్రణాళికలు వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి సాంకేతికతను సాధనంగా తీసుకుంటున్నామన్నారు. . ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో భారత దేశం నుంచి ప్రాతినిధ్యం ఉండాలిని ఆకాంక్షించారు. అందులో అమరావతిని ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా నిలపాలన్నదే తన ప్రయత్నమన్నారు.

అమరావతికి సమీపంలో ఇప్పటికే రెండు పెద్ద నగరాలు అభివృద్ది చెందాయని, అమరావతిని క్రమంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రికార్డు సమయంలో రాజధానికి బృహత్తర ప్రణాళికను రూపొందించి ఇచ్చినందుకు సింగపూర్‌కు థ్యాంక్స్ చెప్పారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు 40 నుంచి 50 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా.
సింగపూర్ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తోందని చంద్రబాబు ప్రశంసించారు.

అమరావతి ప్లాన్ తనను ఎంతో ఆకట్టుకుందని సింగపూర్ మంత్రి వోంగ్ అన్నారు. ప్రణాళికబద్ధమైన వృద్ధికి గ్రీన్‌ఫీల్డ్ సిటీ ఎన్నో అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమరావతిలో ఇక జనాభా అభివృద్ధి చెందాల్సి ఉందని, ఇటీవల సింగపూర్ మంత్రులు చాలామంది భారత్ సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషం వ్యక్తం చేశారన్నారు. అమరావతి అభివృద్ధి చెందుతున్న తీరు బాగుందని, రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు భూములివ్వడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ విధానం అందరికీ మార్గదర్శకం అన్నారు.

అమరావతి నగర నిర్మాణంలో నవీన సాంకేతికత, వినూత్న విధానాలను అమలు చేయడానికి తప్పకుండా సహకరిస్తాం అని తెలిపారు. హరిత నగరంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వామ్యం తీసుకుంటాం అని అన్నారు. సింగపూర్ మంత్రి లారెన్స్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ నగరాల ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu reached Singapore to attend World Cities Summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X