3వేల కోట్ల చైనా పెట్టుబడులు: భేటీలతో చంద్రబాబు బిజీ(పిక్చర్స్)

బీజింగ్/విజయవాడ: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిరోజే బిజీబిజీగా గడిపారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు అమరావతి స్వర్గ్ధామమని, పెట్టుబడిదారులకు అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, చైనా ప్రభుత్వ రంగ సంస్థ అన్‌స్టీల్‌ రూ.3 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారం స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఇందుకు అనుకూలమైన భూమి ఉందని, కడపలో బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి ఆదివారం పలువురు వాణిజ్యవేత్తలు, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 4.10 గంటలకు హాంకాంగ్‌ చేరుకున్న ముఖ్యమంత్రి బృందం అక్కడి నుంచి టియాంజిన్‌ వెళ్లింది. అన్‌స్టీల్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమయింది. ఆ సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ జువెన్‌ గేంగ్‌ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం స్థాపన తమ ప్రాధాన్యమని తెలిపారు. రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

రాష్ట్రానికి సంస్థ తరఫున ఓ ప్రతినిధి బృందాన్ని పంపించాలని ఆహ్వానించారు. బ్రహ్మణి స్టీల్స్‌కి కేటాయించిన భూముల్నీ పరిశీలించవచ్చని తెలిపారు. ఆ స్థలం కృష్ణపట్నం నౌకాశ్రయానికి సమీపంలో ఉంటుందనీ, ఇనుప ఖనిజం పుష్కలంగా లభ్యమయ్యే ప్రాంతమని చెప్పారు. 21 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. హాంగ్జు డింగ్షెన్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జోగ్జిన్హాయ్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. గనులు, ఖనిజ ఉత్పత్తి రంగంపై చర్చించారు.

శ్రీలంక ప్రధాని శుభాకాంక్షలు: మంత్రి సమర విక్రమతో భేటీ

శ్రీలంక అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల మంత్రి సమరవిక్రమతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే పంపించిన శుభాకాంక్షల సందేశాన్ని ఆయన ముఖ్యమంత్రికి అందజేశారు. రాజధాని అమరావతి నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కువైట్‌కి చెందిన డానిష్‌ డెయిరీ కంపెనీ సీఈఓ మహ్మద్‌ జాఫర్‌తో జరిగిన భేటీలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యాన పంటల్లో రాష్ట్రాన్ని శక్తిమంతంగా చేస్తున్నట్లు వివరించారు.

లిబ్రా గ్రూప్ ప్రతినిధులతో భేటీ

నౌకాయాన, ఆతిథ్య రంగాల్లో తొమ్మిది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన లిబ్రా గ్రూప్ ప్రతినిధి మారిస్ వోవెన్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. లిబ్రా గ్రూప్ ఆసియా విభాగపు కార్యాలయాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. లిబ్రా గ్రూపునకు 85 నౌకలు, 45 హోటల్స్ ఉన్నాయి. నౌకాయానం, విమానయానం, పునరుత్పాదక ఇంధన రంగాలపై స్పష్టమైన ప్రతిపాదనలతో ఆంధ్రప్రదేశ్‌కు రావాలని చంద్రబాబు నాయుడు లిబ్రా గ్రూపు ప్రతినిధులను కోరారు.

'మిత్సుబిషి' ప్రతినిధులతో సమావేశం

మిత్సుబిషి కంపెనీ ప్రతినిధులతో కూడా సిఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మిత్సుబిషికి భారత్‌తో, ప్రత్యేకించి ఎపితో ప్రత్యేక అనుబంధం ఉందని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యోషీ యుకి ఇషి, గ్రూప్ అడ్వైజర్ కొయిషి ఇమురా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విమానయానరంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేశారు.

సైబర్‌ సెక్యూరిటీపై 'పలంటీర్‌'కు ప్రతిపాదన:

ఐటీ ఉత్పత్తుల్లో ప్రసిద్ధి చెందిన హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు. కంపెనీ వైస్‌ప్రెసిడెంట్‌ రొజేరియో రిజీతో మాట్లాడారు. ఏపీ ఆర్థిక మండలి సమన్వయకర్తగా ఉంటుందనీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సైబర్‌ సెక్యూరిటీ ప్రాధాన్యమున్న అంశమనీ, రాష్ట్రంలో కలిసి పనిచేసేందుకు ముందుకురావాలని పలంటీర్‌ టెక్నాలజీస్‌ సంస్థను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రాన్ని డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న విషయాన్ని ఆ సంస్థ గ్లోబల్‌ హెడ్‌ డీవ్‌ గ్లేజర్‌కి వివరించారు.

విద్యారంగంలో ఐటీ సేవలు:

విద్యారంగంలో ఐటీ ఉత్పత్తులను, సేవల్ని అందించిన తొలితరం పారిశ్రామికవేత్తగా మణీందర్‌ బజ్వాకు గుర్తింపు ఉందనీ, ఆయన స్థాపించిన ఎస్పరాంజా ఇన్నోవేషన్‌ సంస్థ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక పైలట్‌ ప్రాజెక్టుని స్థాపించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకి హాజరైన బజ్వాతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పర్యటనలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఉన్నతాధికారులు జె.కృష్ణకిశోర్‌, అజయ్‌జైన్‌, సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

చైనాలో చంద్రబాబు భేటీలు

చైనాలో చంద్రబాబు భేటీలు

పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిరోజే బిజీబిజీగా గడిపారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు.

చైనాలో చంద్రబాబు భేటీలు

చైనాలో చంద్రబాబు భేటీలు

పెట్టుబడులకు అమరావతి స్వర్గ్ధామమని, పెట్టుబడిదారులకు అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, చైనా ప్రభుత్వ రంగ సంస్థ అన్‌స్టీల్‌ రూ.3 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారం స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

చైనాలో చంద్రబాబు భేటీలు

చైనాలో చంద్రబాబు భేటీలు

ఇందుకు అనుకూలమైన భూమి ఉందని, కడపలో బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

చైనాలో చంద్రబాబు భేటీలు

చైనాలో చంద్రబాబు భేటీలు

చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి ఆదివారం పలువురు వాణిజ్యవేత్తలు, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+