• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమరావతిలో వరదొస్తే అంతే..!: 6గంటల పాటు 'చంద్రబాబు' హడావుడి (పిక్చర్స్)

By Srinivas
|

విశాఖ/అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో సేకరించిన భూమిలో 10 వేల ఎకరాల వరకూ తరచూ ముంపునకు గురవుతోందని సీఆర్డీఏ చెప్పింది. ముఖ్యంగా కొండవీటి వాగు 29.50 కిలోమీటర్ల పొడవుండగా, 7,300 క్యూసెక్కుల వరదనీరు అమరావతి మీదుగా ప్రవహిస్తుందని పేర్కొంది.

ఈ వరదకు 13,500 ఎకరాలు మునిగిపోతుండగా, అందులో 10,600 ఎకరాలు సమీకరించిన భూమిలో ఉందని తెలిపింది. మొత్తం అమరావతి పరిధిలో నాలుగో వంతుకు పైగా వరదొస్తే నీట మునుగుతుందని ప్రభుత్వానికి తెలిపింది.

తక్షణం కాంటూరు సర్వే చేయించాలని, వరద తీవ్రతను గుర్తించేందుకు నిపుణులైన హైడ్రాలజికల్ కన్సల్టెంట్‌ను నియమించాలని సిఫార్సు చేసింది. కృష్ణా వరదకట్టల అడుగున ఇసుక, పూడిక ఏ మేరకు ఉందో తేల్చాలని కోరింది. ఇదిలా ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం నాడు విశాఖలో పర్యటించారు. బాబు హఠాత్తు పర్యటనతో అధికారులను పరుగులు పెట్టించారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరగాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ నగరంలో మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ దృష్టి సారించామని తెలిపారు. పోర్టు కార్యకలాపాల వల్ల కాలుష్యం పెరిగిపోతోందని, అందువల్ల కాలుష్య నియంత్రణను పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆర్టీసీ కాంప్లెక్స్‌ను అన్ని విధాలా ఉపయోగంలోకి తీసుకొస్తామన్నారు. నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు వారం రోజుల్లో తుది రూపును ఇస్తామన్నారు. చంద్రబాబు విశాఖలో సుడిగాలి పర్యటన చేశారు. చంద్రబాబు ఆరుగంటల పాటు అకస్మిక తనిఖీలు నిర్వహించారు.

చంద్రబాబు

చంద్రబాబు

నగరంలో వచ్చే జనవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో భారీగా పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నామని, దీనికి 70 దేశాల నుంచి ప్రతినిధులు వస్తారని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఫిబ్రవరిలో జరిగే యుద్ధ నౌకల విన్యాసాల ప్రదర్శనలో 80 దేశాలు పాల్గొంటాయన్నారు. భవిష్యత్తులో కీలక కార్యక్రమాలకు విశాఖ వేదిక కానుందని ఈ నేపథ్యంలో మహా నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆకర్షణీయ నగరంగా ఎదగనున్న విశాఖకు మరింత ప్రఖ్యాతి రావాలంటే ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆదివారం ఆరు గంటల పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన... అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

పరిశుభ్రమైన నగరంగా తయారు చేయడంతోపాటు, విద్య, వైద్యం, పర్యటకం, ఐటీ, పారిశ్రామికంగా ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ ఓడరేవు ప్రాంతంలో కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పచ్చదనం అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ కేంద్రంగా కాలుష్య నియంత్రణ మండలి కేంద్రం ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధునాతన పరికరాలు రప్పిస్తామన్నారు. విశాఖలో సిగ్నేచర్‌ టవర్‌ ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించామని, భోగాపురంలో విమానాశ్రయం వస్తుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక బస్సులో ఉదయం 6.20గంటల నుంచి మధ్యాహ్నం 12.25 గంటల వరకు దాదాపు 100 కిలో మీటర్లకు పైగా పర్యటించారు. పాత నగరంలో పారిశుద్ధ్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

కల్వర్టు సమీపంలో కుంగి ప్రమాదకరంగా ఉన్న రహదారిని చూసిన ఆ ప్రాంత పారిశుద్ధ్య బాధ్యతల్లో ఉన్న జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస రావుపై తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ పోర్టు ప్రాంగణంలోని బొగ్గు నిల్వలను చూసిన చంద్రబాబు కాలుష్య నియంత్రణకు కనీస చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. బొగ్గు వల్ల పరిసర ప్రాంతాలన్నీ నల్లగా బూడిదతో నిండిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

చంద్రబాబు

చంద్రబాబు

అధికారులు ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఆనందంగా గడిపేస్తున్నారని, ఇంత ప్రమాదకరంగా ఉన్న కాలుష్యంపై చర్యలు తీసుకోకపోతే తాము చేయాల్సింది చేస్తామని పోర్టు అధికారులను హెచ్చరించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. అవసరమైతే ఆపేయిస్తామన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vizag to be Beautified, Developed Before International Fleet Review: CM Chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more