చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ అభ్యర్థుల తరఫున సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన న్యూఢిల్లీలో తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులను మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు.ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా దిల్లీలోని తెలుగు అసోసియేషన్ సైతం చంద్రబాబును ఆహ్వానించింది.

ఫిబ్రవరి 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.ఢిల్లీలో సుమారు 10 లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఫిబ్రవరి 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

AP CM Chandrababu Naidu to campaign on behalf of BJP in Delhi Assembly elections

మరోవైపు చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం జరిగింది.పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, నిధుల సాధనకు సమన్వయంపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. బడ్జెట్​లో కేటాయింపులకు అదనంగా కేంద్రం నుంచి ఏం రాబట్టాలి అనే కోణంలో చర్చ జరిగిందని ఎంపీలు వెల్లడించారు.రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేసారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ స్థానం పరిధిలో పార్టీ బలోపేతం పైనా సీఎం సూచనలు చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+