Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓపిక పట్టండి: రూ.10వేల కోట్లు అడిగిన చంద్రబాబు, ఆన్‌లైన్ సేవలపై..

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీలో ప్రజల సమస్యలు తీర్చేందుకు రూ.10వేల కోట్లు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

అమరావతి: నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అవి తొలగించేందుకు రూ.10వేల కోట్లు చిన్న కరెన్సీలో ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు విజ్ఞప్తి చేసారు.

నోట్ల రద్దుతో ఏపీ వ్యాప్తంగా సమస్యలు నెలకొన్నాయని చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో మాట్లాడానని తెలిపారు. ఇప్పటి వరకు రూ.8 వేల కోట్లు పంపారని, ఇంకా 10వేల కోట్ల రూపాయలు పంపాలని కోరామన్నారు.

ఆన్‌లైన్ సేవలు పెంచాలన్నారు. అందుకే 80 శాతం ఈ-పాస్ మిషన్స్‌కు సబ్సిడీ ఇవ్వాలన్నారు. అలాగే ఆన్ లైన్ చెల్లింపులకు ఇన్సెంటివ్స్ ప్రకటించాలని సూచించారు. ఆన్ లైన్ సేవలంటేనే చాలామంది భయపడిపోతున్నారన్నారు. ఇప్పుడున్న ఆన్ లైన్ సేవలను ప్రక్షాళన చేయాలన్నారు.

వ్యవసాయదారులకు ఇబ్బందులు లేకుండా సహకార బ్యాంకులలో పాత నోట్లు తీసుకుని, వాటి స్థానంలో కొత్త నోట్లు ఇవ్వాలన్నారు. ఏపీలో ఆరు కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లున్నాయన్నారు. వీరందరూ ఆన్ లైన్ సేవలు వినియోగించుకునేందుకు వీలుగా స్వైపింగ్ ఛార్జీలు తొలగించాలని చెప్పారు.

రాష్ట్రంలో 75 శాతం మందికి డెబిట్ కార్డులుంటే, వాటిని వినియోగించేవారు కేవలం 30 శాతం మందే అన్నారు. రాష్ట్రంలో 9,51,000 లక్షలకు పైగా ప్రజలకు బ్యాంకు అకౌంట్లు లేవన్నారు. 39 వేల మందికి అకౌంట్లు ఓపెన్ చేసేందుకు చర్యలు చేపట్టగా, మిగిలిన వారికి ఇంకా అకౌంట్లు జారీ చేయాల్సి ఉందన్నారు. ఇది సమస్యా కాలమని, ప్రజలు ఓపికగా ఉండాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+