గండిపై చంద్రబాబు సీరియస్, వెంట శిద్ధా: 50 ఏళ్లలో లేని వర్షం (పిక్చర్స్)

ఒంగోలు/నెల్లూరు: ఎంత ఖర్చు అయినా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం అన్నారు. తక్షఖణ సాయం కింద అందరికీ 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, చక్కెర, వంట నూనె ఉచితంగా ఇస్తామని చెప్పారు.

ప్రతి కుటుంబానికి రూ.4వేల నగదు ఇస్తామన్నారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో... వరద ముంపుకు గురైన వెంకటగిరి, గూడురు, చిల్లకూరు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్షణం రూ.4వేలు, నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆదుకుంటామన్నారు.

బాధితులు కోలుకునేంత వరకు సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తామన్నారు. వస్త్రాల కొనుగోలుకు రూ.2వేలు, ఇతర సరుకుల కొనుగోలుకు రూ.2వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు.

ఇళ్లు కోల్పోయిన వారికి రూ.50వేలు, పాక్షికంగా కోల్పోయిన వారికి రూ.25 వేలు, గుడిసెలు కోల్పోయిన వారికి రూ.ఆరున్నరవేలు, మగ్గానికి రూ.10వేలు, మత్సకారుల బోట్లు, వలల పైన అంచనా వేసి పరిహారం ఇస్తామన్నారు. పంటలు నష్టపోయిన వారిని కూడా ఆదుకుంటామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రూ.1000 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.

చంద్రబాబు సీరియస్

చంద్రబాబు సీరియస్

జాతీయ రహదారి డిజైను లోపం వల్ల గండిపడిందని అంటున్నారని, దీనిపై విచారణ చేయిస్తానని,క రైల్వేట్రాక్‌కు 16 వంతెనలు ఉంటే జాతీయ రహదారికి ఒకటే నిర్మించారని, దీనివల్ల వరద ఉద్ధృతి పెరిగి గండి పడిందని అంటున్నారని చంద్రబాబు చెప్పారు. వెంటనే మరమ్మతులు చేయించామన్నారు. శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తానని చెప్పారు. కాగా, మంత్రి శిద్ధా రాఘవ రావు అక్కడే కూర్చీ వేసుకొని కూర్చొని పనులు పూర్తి చేయించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు

చంద్రబాబు

వరద ముంపునకు గురయిన వెంకటగిరి, గూడూరు, చిల్లకూరు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. వెంకటగిరిలో ఎన్టీఆర్‌ నగర్‌లో పలు నివాసాలను పరిశీలించారు. గూడూరులో పరిస్థితిని పరిశీలించారు. పాలిచెర్లవారిపాలెం గ్రామం సందర్శించారు. బాధితులు కోలుకొనేంత వరకు సహాయక చర్యలు తీసుకుంటామని, ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

నెల్లూరు జిల్లాలో ఏడాది వర్షం ఒక్క నాలుగు రోజుల్లో కురిసిందని, హెలికాప్టర్లు వచ్చినా ఉపయోగం లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా వచ్చానని, నాలుగు రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని, మీరు కష్టాలు పడితే బాధపడే వ్యక్తిని నేనే అని, సాధారణ రోజుల్లో కాదు కష్టాల్లో ఉన్నప్పుడే సాయం చేయాలని చంద్రబాబు అన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

చౌకధర దుకాణాలకు వెళ్లి డిమాండ్‌ చేసి సరుకులు తీసుకోవాలని, వస్త్రాలు కొనుగోలుకు రూ.2 వేలు, ఇతర సరకులు కొనుగోలుకు రూ.2 వేలు అందిస్తున్నామన్నారు. కాగా, వర్షాల వల్ల సోమశిలలో 50 టీఎంసీలు, కండలేరులో 13.50 టీఎంసీలు చేరింది. చెరువుల్లో 20 టీఎంసీల వరకు చేరింది.

 చంద్రబాబు

చంద్రబాబు

ఈ ఏడాది కూడా జిల్లాలో 8.50 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చంద్రబాబు అన్నారు. విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశానని అన్నారు. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వీధుల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. గాలేరు-నగరి గుంజనేరు అనుసంధానంభారీ వర్షాలకు పంటలు నష్టపోయిన కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలో సీఎం శుక్రవారం పర్యటించారు. రైల్వేకోడూరులో ఉద్ధృతంగా ప్రవహించిన గుంజనేరును పరిశీలించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఓబుళవారిపల్లె మండలంలోని బి.కమ్మపల్లె, బొమ్మవరం, బీపీ రాజుపల్లె గ్రామాల్లో దెబ్బతిన్న ఉద్యావన పంటలు, కొట్టుకుపోయిన వంతెనలను చూశారు. పరిస్థితిని కలెక్టర్‌ కేవీ రమణ, జిల్లా నేతలను అడిగి తెలుసుకున్నారు. రైతుల్ని ఆదుకుంటామన్నారు. వర్షాల వల్ల భూగర్భజలం పెరిగేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. ఇదిలా ఉండగా, గత 50 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కురవనంతగా వర్షాలు పడి జనజీవనం అతలాకుతలమైపోయింది.
చంద్రబాబు

గండిపై చంద్రబాబు సీరియస్, వెంట శిద్ధా: 50 ఏళ్లలో లేని వర్షం (పిక్చర్స్)

గండిపై చంద్రబాబు సీరియస్, వెంట శిద్ధా: 50 ఏళ్లలో లేని వర్షం (పిక్చర్స్)

నెల్లూరు జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య కేవలం పది రోజుల్లోనే 740.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో సాధారణ వర్షపాతం 197.6 మి.మీ. ఉంటుంది. నమోదైన వర్షపాతం వివరాలు చూసి అధికారులు విస్తుపోతున్నారు. నైరుతి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకూ సాధారణంగా 839.9 మి.మీ. వర్షం పడాల్సి ఉంటే శుక్రవారం నాటికి 1,163 మి.మీ. కురిసింది. గత 50ఏళ్లలో నెల్లూరు జిల్లాలో ఉన్న సగటు వర్షపాతం 500 మి.మీ. మాత్రమే.

 వదంతులు నమ్మొద్దు

వదంతులు నమ్మొద్దు

రాబోయే రెండుమూడు రోజుల్లో భారీ హరికేన్‌ శ్రీలంక వీుదుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాలను తాకుతుందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని విపత్తు నిర్వహణశాఖ వర్గాలు కోరాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వదంతులు వ్యాప్తి చెందడంతో ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారని, వీటిలో నిజం లేదని అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+