"న్యూ ఇయర్" విషెస్ తెలిపిన ఏపీ సీఎం.. ప్రజలకు మరో హామీ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సీఎం నారా చంద్రబాబు నాయుడు పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) లో తన సందేశాన్ని రాసుకొచ్చారు. ఆ పోస్టులో గత ఏడాది ప్రభుత్వ పాలనతో పాటు.. రానున్న ఏడాదిలో చేపట్టబోయే పనుల గురించి వివరించారు.
కాగా గడిచిన 2025 సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు మరిచిపోలేని మైలురాళ్లను అందించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు... గత విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు అని ఆయన అభివర్ణించారు. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఏడాది నాంది పలికిందని తెలిపారు.

సంక్షోభాల మధ్య సాధించిన పురోగతి..
రాష్ట్రం ఎన్నో సంక్షోభాలు, సమస్యలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, వాటిని అధిగమించి గణనీయమైన పురోగతి సాధించిందని సీఎం అన్నారు. ప్రతి రంగంలోనూ మార్పు కనిపించిందని, ప్రజల్లో నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. 2025 సంవత్సరం పాలనా పరంగా, అభివృద్ధి పరంగా గుర్తుండిపోయే ఏడాదిగా నిలుస్తుందన్నారు.
#HappyNewYear2026
— N Chandrababu Naidu (@ncbn) December 31, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించింది. ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఏ రంగంలో చూసినా...… pic.twitter.com/RAonrsHown
అలానే మంత్రి నారా లోకేష్ సైతం సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు. ఆ పోస్టులో.. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఆశయాల సాధనకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిద్దాం. కలలు సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణతో శ్రమిద్దాం. శాంతి, క్రాంతిని పెంచేందుకు ఈ కొత్త ఏడాదిలో సమష్టి కృషి చేద్దాం. ప్రగతి-సంక్షేమాలతో నవవసంతం ప్రజలకు ఆయురారోగ్య, ఆనందాలు పంచాలని ఆకాంక్షిస్తున్నాను అని రాసుకొచ్చారు.
#HappyNewYear2026
— Lokesh Nara (@naralokesh) January 1, 2026
అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఆశయాల సాధనకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిద్దాం. కలలు సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణతో శ్రమిద్దాం. శాంతి, క్రాంతిని పెంచేందుకు ఈ కొత్త ఏడాదిలో సమష్టి కృషి చేద్దాం. ప్రగతి-సంక్షేమాలతో నవవసంతం ప్రజలకు… pic.twitter.com/gRjKmLGIbL












Click it and Unblock the Notifications