కరువు సమావేశం నిధుల కోసం కాదు: మానవ తప్పిదాలే కారణమన్న చంద్రబాబు
న్యూఢిల్లీ: ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తే కరువుని ఎదుర్కొవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీని కలిసిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కరువు నివారణంపై రాష్ట్రంలో తీసుకున్న చర్యలను ప్రధానికి వివరించామన్నారు.
12 అంశాలతో కూడిన డిమాండ్లు ప్రధాని ముందు ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కరవు ఎదుర్కొనేందుకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలు నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. గత పదేళల్లో భారత్ లో సంభవించిన తుపానులన్నింట్లో హుదూద్ పెద్దదని మోడీ చెప్పారని ఆయన తెలిపారు.
జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం చేయమని ప్రధానికి సూచించానన్నారు. 12 అంశాలతో కూడిన ప్రధాన డిమాండ్లను ప్రధాని ముందు ఉంచామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేకహోదాపై ఆయనతో చర్చించామన్నారు. కేంద్రం నిధుల వివరాలను ప్రధాని మోడీకి అందజేశామన్నారు.
రాష్ట్రంలో కరువుని ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తే కరువుని ఎదుర్కొవచ్చన్నారు. కరువుకి మానవ తప్పిదాలే కారణమన్నారు. రాష్ట్రంలో కరువుని ఎదుర్కొనేందుకు ఇప్పటికే రూ. 2వేల కోట్లను ఖర్చుపెట్టామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.
ఈ విధానాల ద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువులు, పంట కుంటలు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం వల్ల 80 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి గోదావరిలోకి వదులుతామని ఆయన చెప్పారు. రియల్ టైమ్ వాటర్ మేనేజ్ మెంట్ సిస్టం ను రాష్ట్రానికి పరిచయం చేస్తామని ఆయన తెలిపారు.

చంద్రబాబు మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు:
* లోటు భర్తీ, అమరావతికి నిధులు, పోలవరం అంశం చర్చకు వచ్చింది
* నదులు అనుసంధానంతో కరువుని ఎదుర్కొవచ్చు
* ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీటి సరఫరా లక్ష్యం
* కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో 40 నిమిషాలు భేటీ
* రూ. 737 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా ఇస్తున్నాం
* రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ విస్తృతం చేస్తున్నాం
* పారిశ్రామిక రాయితీలు, రైల్వే జోన్ పై చర్చించాం
* రికార్డు సమయంలో పట్టిసీమను పూర్తి చేశాం
* నీటి వనరులను పొదుపుగా, సమర్ధవంతంగా వాడుకోవాలి
* భూగర్భజలలా పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం
* ఆరు లక్షల పంట కుంటలు తవ్విస్తున్నాం
* యంత్రీకరణ వల్ల ఉత్పత్తి పెరిగి ఖర్చు తగ్గింది
* రెయిన్ గన్స్‌తో 20 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడుకుందాం
* డైవర్షన్ స్కీంను అభివృద్ధి చేయాలని సూచించాం
* కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేస్తాం
* రాష్ట్రంలో 12,500 చెక్ డ్యాంలు కట్టాలని నిర్ణయించాం
* మూడు జిల్లాల నదులతో రూ. 5129 కోట్ల నష్టం
* రైతులు ఒకే పంటపై ఆధారపడితే ఇబ్బందులు వస్తాయి
* కరువు సమావేశం నిధుల కోసం కాదు












Click it and Unblock the Notifications