ఎంపీలతో బాబు కీలక భేటీ: ఎంపీలు కేశినేని నాని, టీజీ, అవంతి ఆగ్రహం
అమరావతి: బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఎంపీలతో భేటీ అవుతున్నారు. బీజేపీతో కలిసి ఉండాలా లేదా అనే నిర్ణయం ఆయన తీసుకోనున్నారు. బీజేపీకి కటీఫ్ చెబితే పోలవరం ప్రాజెక్టు, నవ్యాంధ్ర రాజధాని పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఎంపీలతో జరిగే భేటీలో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ భేటీకి మంత్రి యనమల రామకృష్ణుడు హాజరవుతున్నారు. భేటీ నేపథ్యంలో ఎంపీలు టీజీ వెంకటేష్, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
బడ్జెట్ పైన తీవ్ర అసంతృప్తి ఉందని, ఏం చెయ్యాలో ఇవాళ్టి సమావేశంలో నిర్ణయిస్తారని టీజీ వెంకటేష్ చెప్పారు. దేశమంతా బడ్జెట్ బాగుండవచ్చునని, రాష్ట్రానికి మాత్రం అన్యాయం జరిగిందని కేశినేని నాని అన్నారు. రాష్ట్రం నిలదొక్కుకోవాడనికి అవకాశం ఇవ్వాల్సిన అవసరముందని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చేసేందుకు సిద్ధమని ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు. చంద్రబాబులాంటి సీనియర్ నేత 42సార్లుఢిల్లీకి వెళ్లి కలిస్తే పట్టించుకోలేదని వాపోయారు. గత ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications