ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఏపీకి ఈ బెనిఫిట్.. ఫోకస్ చెయ్యమన్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ను ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పోర్టులు, షిప్పింగ్ హార్బర్ ల పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం వంటి కొత్త పోర్టులలో కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు.
పక్క రాష్ట్రాల నుండి కార్గో సేవలు ఆకర్షించాలన్న సీఎం చంద్రబాబు
చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కార్గో రవాణాను ఆకర్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఒడిస్సా, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల అంతర్భాగం నుండి కార్గో రవాణాను ఆకర్షించాలి అన్నారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు 2026 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని అధికారులు చెప్పారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీలు ఏర్పాటు తర్వాత రామాయపట్నం కంటైనర్ బల్క్ కార్గో పోర్టుగా మారుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

పోర్టు టౌన్ షిప్ లు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి చెయ్యాలన్న సీఎం
అంతేకాదు రామాయపట్నం నుండి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక రైల్వే మార్గానికి కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని, దీనివల్ల పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని చంద్రబాబు వెల్లడించారు. పోర్టుల సమీపంలో పోర్టు టౌన్ షిప్ లు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి ద్వారా వాణిజ్య లావాదేవీలను పెంచాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రెండవ దశ షిప్పింగ్ హార్బర్ ల నిర్మాణాన్ని వేగవంతం చెయ్యాలని ఆదేశం
రెండవ దశలో చేపడుతున్న బుడిగట్ల పాలెం, పూడిమడక, కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఒక షిప్పింగ్ హార్బర్ ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తూర్పు కోస్తా లాజిస్టిక్స్ హబ్ గా మార్చాలని ఆయన తెలిపారు. కార్గో హ్యాండ్లింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోర్టులు గేమ్ చేంజర్ గా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
యుద్ధ సమయంలో అందివస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
ప్రస్తుత యుద్ద కారణాల వల్ల దుబాయ్, గల్ఫ్ దేశాల ఓడరేవులు ఇబ్బందులలో ఉన్నాయని, భారతదేశంలోని తూర్పు తీరపు పోర్టులు సురక్షిత ప్రత్యామ్నాయంగా మారాయని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ సమయంలో ఈ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నూతన పోర్ట్ లలో త్వరితగతిన ఆపరేషన్లు ప్రారంభించాలని, రెండో దశ షిప్పింగ్ హార్బర్ ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పోర్టుల నిర్వహణలోనూ, కార్గో సేవలను అందించడంలోనూ ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్ గా ఏపీ గుర్తింపు పొందాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
-
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications