ఢిల్లీకి చంద్రబాబు పయనం-రేపు ప్రధాని, మంత్రులతో భేటీ-అజెండా ఇదే..!
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం అయ్యారు. రేపు ప్రధాని మోడీ, ఇతర కేంద్రమంత్రులతో అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేసుకున్న చంద్రబాబు.. ఇవాళ విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లారు. ఇవాళ రాత్రికి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం నుంచి అపాయింట్ మెంట్ల ప్రకారం ప్రధాని, మంత్రులతో బాబు భేటీ అవుతారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులపై చర్చిస్తారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత రెండోసారి సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు కీలక డిమాండ్లు నెరవేర్చుకున్న చంద్రబాబు.. ఈసారి కూడా ముఖ్యమైన అజెండాతోనే వెళ్లారు. కేంద్ర బడ్జెట్ లో ఈసారి లక్ష కోట్ల మేర కేటాయింపులు కావాలని గతంలో కోరిన చంద్రబాబు.. తాజా పరిణామాల నేపథ్యంలో కనీసం రూ.30 వేల కోట్లు అయినా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇందులో ఏమేం ఉండాలన్నది రేపు ప్రధాని, మంత్రులతో చర్చిస్తారు.

అలాగే రాష్ట్ర విభజనపై ఢిల్లీలో ఈ నెల 24న రెండు తెలుగు రాష్ట్రాల భేటీ జరగబోతోంది. కేంద్ర హోంశాఖ నిర్వహించే ఈ భేటీకి రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ భేటీలో చర్చించే అంశాలపైనా చంద్రబాబు రేపు ప్రధాని మోడీ, అమిత్ షా తో ముందుగా చర్చిస్తారు. అలాగే కీలకమైన పోలవరం, అమరావతి ప్రాజెక్టులతో పాటు రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పే అంశం కూడా చర్చించే అవకాశముంది. గతంతో పోలిస్తే ప్రస్తుత ఎన్డీయే సర్కార్ లో చంద్రబాబుకు పెరిగిన ప్రాధాన్యం దృష్ట్యా ఆయన ఢిల్లీ పర్యటనపై భారీ అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications