అదే మన ప్రత్యేకత: మొబైల్ ఏటీఎంలు ప్రారంభించిన చంద్రబాబు
Recommended Video

మొబైల్ ఏటీఎంలు ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం మొబైల్ ఏటీఎంను లాంఛనంగా ప్రారంభించారు. పౌరుల్లో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంపొందించేందుకు 12 జిల్లాల్లో 12 మొబైల్ ఏటీఎంలను ఆయన ప్రారంభించారు.
నాబార్డు సాయంతో ఆప్కాబ్ ప్రవేశపెట్టిన వీటిని అమరావతి ప్రజావేదిక హాల్ నుంచి సీఎం జెండా ఊపి అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనాల్లో మైక్రో ఏటీఎంతోపాటు క్యాష్ డిపాజిట్ సదుపాయాలు కూడా ఉన్నాయి.

దేశంలో మరే రాష్ట్ర సహకార బ్యాంకింగ్ వ్యవస్థకూ లేని ఏటీఎం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు నగదు కొరత లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.












Click it and Unblock the Notifications