చంద్రబాబు ఇచ్చేసారు..జగన్ దక్కించుకున్నారు: సతీ సమేతంగా ముఖ్యమంత్రికి: ఇక..ఆ హోదాలో...!
ముఖ్యమంత్రి జగన్‌కు డిప్టమేటిక్ పాస్‌పోర్ట్ దక్కనుంది. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర విదేశాంగ శాఖ దీనిని జారీ చేయనుంది. దీని కోసం ముఖ్యమంత్రి జగన్ సతీ సమేతంగా విజయవాడలోని రీజినల పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లి .. వారికి కావాల్సిన సమాచారం అందించారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోవటంతో కొద్ది రోజుల క్రితం చంద్రబాబు తనకు జారీ చేసిన డిప్లొమేటిక్ పాస్ పోర్టును తిరిగి అప్పగించారు. ఇక..ఆగస్టులో అమెరికా పర్యటన ఖరారైన నేపథ్యంలో జగన్ ఆ వెంటనే ఇతర దేశాల పర్యటనలకు వెళ్లనున్నారు. ఇందు కోసం ఏపీ పరిశ్రమల శాఖ ఇప్పటికే పలు దేశాల్లో వ్యాపార- వాణిజ్య ప్రముఖలతో సమావేశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Recommended Video

జగన్‌కు డిప్లొమేటిక్ పాస్ పోర్ట్..
ముఖ్యమంత్రి జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి విచ్చేసారు. అక్కడ విదేశాంగ శాఖ జారీ చేసిన డిప్లొమేటిక్ పాస్‌పోర్ట్‌ను తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి కేంద్ర విదేశాంగ శాఖ ఈ పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవటంతో తిరిగి తన వద్ద ఉన్న డిప్లొమేటిక్ పాస్ పోర్ట్‌ను అప్పగించేసారు. దీంతో..కొత్త ముఖ్యమంత్రి జగన్ పాస్ పోర్ట్ కార్యాలయంలో వారికి కావాల్సిన వేలి ముద్రలు..సమాచారం అందించారు. ఆ వెంటనే పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు జగన్ దంపతులకు డిప్లొమేటిక్ పాస్ పోర్ట్‌ను అందించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ వచ్చే నెల 15వ తేదీ తరువాత అమెరికా పర్యటన ఖరారైంది. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ వైసీపీ ఎన్నారై విభాగంతో పాటుగా ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

త్వరలో విదేశీ పర్యటనలు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చే నెల అమెరికా వెళ్లనున్న జగన్ ..ఆ తరువాత ఏపీలో పెట్టుబడు లను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు తరహాలో పర్యటనలు చేసి విమర్శ లకు అవకాశం ఇవ్వమని వైసీపీ నేతలు చెబుతున్నారు. పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి..ఆ శాఖ ఉన్నతాధికారులు పెట్టుబడుల ఆకర్షణ కోసం కొత్త పారిశ్రామిక విధానానికి రూప కల్పన చేస్తున్నారు. అదే సమయం లో విదేశాల్లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కొంత కష్టమైనా వీలైనంత రాయితీలు ఇచ్చి పెట్టుబడులను ఆహ్వనిం చాలని భావిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత దీని పైన ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఆ తరువాత ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ఖరారు కానుంది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం











Click it and Unblock the Notifications