రోజాకు ఎట్ట‌కేల‌కు కీల‌క ప‌ద‌వి: జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఇక కీ రోల్‌: ఇంత‌కీ ఏంటీ ఆ బాధ్య‌త‌లు..!

Recommended Video

    రోజాకు కీల‌క ప‌ద‌వి జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీ రోల్‌ || Oneindia Telugu

    వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ఆశించి న‌ప్ప‌టికీ.. ద‌క్క‌లేదు. దీంతో.. రోజా అసంతృప్తికి గుర‌య్యారు. తొలి నుండి జ‌గ‌న్‌కు విధేయురాలిగా ఉంటూ.. టీడీపీని ఎదు ర్కోవ‌టంలో వైసీపీ కీల‌క వాయిస్‌గా ఉన్న రోజాకు త‌గిన గుర్తింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీంతో ..మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేక‌పోయిన కీల‌క నేత‌ల‌ను జ‌గ‌న్ త‌న వ‌ద్ద‌కు పిలిపించుకున్నారు. త‌గిన ప్రాధాన్య‌త ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేర‌కు కొద్ది సేపటి క్రితం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

    రోజాకు ద‌క్కిన కీల‌క ప‌ద‌వి...

    రోజాకు ద‌క్కిన కీల‌క ప‌ద‌వి...

    వైసీపీ కీల‌క నేత..న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డ రోజాతో జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టంతో అదే వ‌ర్గానికి చెందిన రోజాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేక‌పోయామ‌ని..రెండున్నారేళ్ల త‌రువాత ఖ‌చ్చింగా మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇదే స‌మయంలో కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో రోజాకు ఆర్టీసీ ఛైర్మ‌న్ ఇస్తార‌ని..మ‌హిళా క‌మీష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌గా ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే, ముఖ్య‌మంత్రి త‌న ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త లో భాగంగా రోజాకు త‌గిన ప్రాధాన్య‌త క‌లిగిన పోస్టు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీంతో..ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రోజా కు కీల‌క ప‌ద‌వి ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

    ఏపీఐఐసి ఛైర్ ప‌ర్స‌న్‌గా రోజా..

    ఏపీఐఐసి ఛైర్ ప‌ర్స‌న్‌గా రోజా..

    నూత‌న రాష్ట్రం..నూత‌న ప్ర‌భుత్వం ఏర్పాటైన ఏపీలో పారిశ్రామిక అభివృద్ది కోసం తీసుకొనే నిర్ణ‌యాల్లో కీల‌క భూమిక పోషించే ఆంధ్ర‌ప్ర‌దేశ్ మౌళిక వ‌స‌తుల అభివృద్ది సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్ ప‌ర్స‌న్‌గా రోజాను నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. జ‌గ‌న్ తండ్రి వైయ‌స్సార్ హ‌యాంలో ఇదే ఏపీఐఐసి ఛైర్మ‌న్ ప‌ద‌విని అంబ‌టి రాంబాబుకు కేటాయించారు. ఆ త‌రువాత రోశ‌య్య హ‌యాంలో తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన శివ‌రామ సుబ్ర‌మ‌ణ్యం ప‌ని చేసారు. ఆయ‌న ప్ర‌స్తుతం వైసీపీలోనే ఉన్నారు. ఇక‌, గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌న్నిహితుడైన కృష్ణ‌య్య ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీఐఐసి ఛైర్మ‌న్‌గా మ‌హిళ‌కు అవ‌కాశం ద‌క్క‌లేదు. ఇప్ప‌టికే ఎస్టీ మ‌హిళా ముఖ్య‌మంత్రి..ఎస్సీ మ‌హిళా హోం మంత్రి.. ఇప్పుడు కీల‌క‌మైన ఏపీఐఐసి ఛైర్ ప‌ర్స‌న్‌గా మ‌హిళ‌కు అవ‌కాశం ఇచ్చారు.

    ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర‌...

    ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర‌...

    ఏపీఐఐసీ ఛైర్మ‌న్‌గా రోజా ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. ఏపీలో ఇప్ప‌డు పారిశ్రామికంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంది. నూత‌న ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీ..కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌కు భూ కేటాయింపులు వంటి అంశాలు కీల‌కం కానున్నాయి. ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా నెల్లూరు జిల్లాకు చెందిన మేక‌పాటి గౌతం రెడ్డికి కేటాయించారు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌ద‌వి ద్వారా రోజాకు కీల‌క ప‌ద‌వి ద‌క్కిన‌ట్టే. అయితే, అస‌లు రోజాకు ఇటువంటి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కేబినెట్ కూర్పు నుండి త‌న స‌మీక‌ర‌ణాల్లో కొత్త ట్విస్టులు ఇస్తూనే ఉన్నారు. ఇక‌, ఇప్పుడు ఈ నియ‌మకం పైన రోజా ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+