• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న‌న్న ఆశ‌ల‌న్నీ వారిమీదే!! ఈవీఎంలో నొక్కుతారో? లేదో?

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈసారి ఎన్నిక‌ల‌కు త‌న ఆశ‌ల‌న్నీ బీసీల‌మీదే పెట్టుకున్నారు. కాపుల ఓట్లు వైసీపీకి ప‌డ‌టం క‌ష్ట‌మ‌నే అభిప్రాయానికి రావ‌డంతో ఆ భ‌ర్తీని బీసీ ఓటుబ్యాంకును పెంచుకోవ‌డంద్వారా భ‌ర్తీచేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. అందుకు అనుగుణంగానే ముఖ్య‌మంత్రి బీసీ జ‌పం చేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ..

ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ..

ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అన్ని పార్టీలు త‌మ ప్ర‌ధాన ఓటుబ్యాంకును ప‌టిష్ట‌ప‌రిచే ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి. బీసీలు మొద‌టి నుంచి తెలుగుదేశంపార్టీవైపు మొగ్గుచూపుతున్నారు. గత ఎన్నిక‌ల్లో మాత్రం ఎక్కువ సంఖ్య‌లో వైసీపీకి ఓటు వేయ‌డంతో ఆ పార్టీకి అధికారం సులువైంది.

బీసీలు కొన్ని ద‌శాబ్దాలుగా తెలుగుదేశంపార్టీ వైపు ఉన్నారు. త‌రం మారేకొద్దీ బీసీలోని యువ‌త మాత్రం వైసీపీవైపు మొగ్గుచూపుతోంది. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రెడ్లు ఎలాగూ త‌న‌వైపే ఉంటారు కాబ‌ట్టి బీసీల‌ను ఆక‌ర్షించుకుంటే అధికారం సులువుగా ద‌క్కించుకోవ‌చ్చ‌నేది ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌గా ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలంటున్నాయి.

కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసినా నిధులేవీ?

కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసినా నిధులేవీ?

బీసీల కోసం 56 కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసినా త‌మ‌కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏం చేశార‌నే ప్ర‌శ్న‌లు బీసీల‌వైపు నుంచి వినిపిస్తున్నాయి. సంక్షేమ ప‌థ‌కాల‌ద్వారా త‌మ ఖాతాల్లో డ‌బ్బులు వేయ‌డం మిన‌హా త‌మ‌కు ఒరిగిందేమీ లేద‌ని పెద‌వి విరుస్తున్నారు. బీసీ కార్పొరేష‌న్ల‌కు నిధులు కేటాయించ‌లేద‌ని, వాటికి నిధులు కేటాయించివుంటే స్వ‌యం ఉపాధిద్వారా ఎంతోమంది ల‌బ్ధి పొందేవార‌ని, అలా కాకుండా కేవ‌లం ప‌థ‌కాల పేరుతో త‌మ ఖాతాల్లో వేసిన డ‌బ్బు పిల్ల‌ల ఫీజులు చెల్లించ‌డానికే సరిపోతోందంటున్నారు.

ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌చేస్తే బాగుండేది!!

ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌చేస్తే బాగుండేది!!

రాజ‌కీయంగా బీసీల‌కు ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే భావ‌న‌లో మూడు సంవ‌త్స‌రాల నుంచి ఉన్నామ‌ని , అయిన‌ప్ప‌టికీ త‌మ‌కు ద‌క్కింది శూన్య‌మ‌ని బీసీ సంఘాల నాయ‌కులు అంటున్నారు. చివ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిని ఎంపిక చేయాల‌న్నా తెలంగాణ నుంచి కృష్ణ‌య్య‌ను ఎంపిక చేశార‌ని, అది ఏవిధంగా రాష్ట్రానికి, బీసీల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీలోని బీసీ నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తే బాగుండేద‌ని వైసీపీ నేత‌లు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనిద్వారా త‌మ ముఖ్య‌మ‌త్రి జ‌గ‌న్ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో ఇప్పుడే చెప్ప‌లేమంటున్నారు.

సామాజిక న్యాయ‌భేరివ‌ల్ల ఫ‌లితాలుంటాయా?

సామాజిక న్యాయ‌భేరివ‌ల్ల ఫ‌లితాలుంటాయా?

మంత్రివ‌ర్గంలో బీసీల‌కు స్థానం కేటాయించ‌డంతోపాటు నామినేటెడ్ ప‌ద‌వుల్లోను ఎక్కువ అవ‌కాశాలిచ్చిన‌ట్లు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల‌తో ఇటీవ‌ల నిర్వ‌హించిన సామాజిక న్యాయ‌భేరి బ‌స్సు యాత్ర వ‌ల్ల ఎటువంటి ఫ‌లితాలు ల‌భిస్తాయో ఇప్పుడే చెప్ప‌లేమ‌ని, క్షేత్ర‌స్థాయిలో బీసీలు సంఘ‌టిత‌మ‌య్యేదాన్నిబ‌ట్టి రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు విశ్లేషిస్తున్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో బీసీలు ఏ పార్టీవైపు మొగ్గితే ఆ పార్టీకే అధికారం ద‌క్క‌డం ఖాయ‌మ‌ని వారు చెబుతున్నారు.

English summary
Chief Minister Jagan, who has high hopes for Bcs in this election
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X