వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం వైఎస్ జగన్ భేటీ: ఏపీలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు.

కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేయాలని సీఎం జగన్ కేంద్రమంత్రిని కోరారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా, శనివారం ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనూ సీఎం జగన్ పాల్గొన్నారు.

 AP cm jagan meets Union health minister for new medical colleges

కాగా, ఏపీ సీఎం జగన్ మంగళవారం ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర పెద్దలను ఆయన కోరనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ నిధుల మంజూరు అంశాన్ని సీఎం ప్రస్తావించనున్నారు.

ప్రధానంగా పోలవరం అంశాన్ని ప్రధాని మోడీ, జల్‌శక్తి మంత్రి షెకావత్‌ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. పోలవరం పనులను వేగవంతం చేసేలా చూడాలని ఇప్పటికే ఆర్థిక, ఇతర శాఖలను కేంద్రం ఆదేశించింది. ఇటీవల జరిగిన అపెక్స్‌ సమావేశంలో కీలక ఆదేశాలు సైతం ఇచ్చింది. ఏపీలో ఇంతకుముందు 13 జిల్లాలు ఉండగా, మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ నేపథ్యంలోనే ఏర్పాటైన కొత్త జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు.

English summary
AP cm jagan meets Union health minister for new medical colleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X