Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ 2023 లో మళ్లీ సీఎం అవుతారా-కేవీపీ తేల్చేసారు : ఇలా చేస్తేనే-సంబంధాల పైనా..!!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆత్మ..జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జగన్ పాలన పైన ఆయన కీలక సూచనలు చేసారు. ఒక ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు. జగన్ ను చిన్నప్పటి నుంచి దగ్గరగా చూసిన ఆయన..ఇప్పుడు జగన్ కు చేసిన సూచనల పైన చర్చ మొదలైంది. తాను-జగన్ ఒకే పార్టీలో ఉన్నంత వరకూ అన్నీ కష్ట-సమస్యలు షేర్ చేసుకున్నామని..పార్టీ వీడిన తరువాత తమ మధ్య సంబంధాలే తప్ప...అప్పటిలాగా అన్నీ పంచుకొనే విధానం దూరమైందని వివరించారు.

 జగన్ ప్రజా బలం పైన కేవీపీ...

జగన్ ప్రజా బలం పైన కేవీపీ...


ఇక, జగన్ బలం గురించి కేవీపీ విశ్లేషించారు. ఉమ్మడి రాష్ట్రంలో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ -టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలు జరిగితే రెండు మినహా అన్ని స్థానాలు జగన్ గెలిచారని... కడపలో జగన్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రామచంద్రాపురం, నర్సాపురం మినహా అన్నింటా జగన్ పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తు చేసారు. నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికలో తాము సుబ్బిరామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో దింపి కష్టపడితే..జగన్ అభ్యర్ధి మేకపాటి అత్యధిక మెజార్టీతో గెలుపొందగా..టీడీపీ డిపాటిట్ కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఇక, జగన్ ప్రభుత్వం పైన ప్రస్తుతం వస్తున్న విమర్శల గురించి ఆయన స్పందించారు.

నాడు వైఎస్సార్ పైనా ఇవే విమర్శలు..

నాడు వైఎస్సార్ పైనా ఇవే విమర్శలు..

నాడు వైఎఎస్సార్ సైతం పాదయాత్ర ముందు వరకు ఇదే వయసులో..ఇటువంటి విమర్శలే ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. పాదయాత్ర తరువాత ఆయనలో పూర్తి గా మార్పు వచ్చిందన్నారు. ఇక, వైఎస్సార సైతం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన సమయంలో కేబినెట్ లోని సీనియర్లు-మంత్రులు-సలహాదారులతో సమస్యల పైన చర్చించి...నిర్ణయం తీసుకొనే వారని కేవీపీ చెప్పుకొచ్చారు. రోశయ్య లాంటి సీనియర్ల సలహాలు తీసుకొనే వారని గుర్తు చేసారు. ఇప్పుడు జగన్ కూడా చేయాల్సింది అదేనని ..దాని ద్వారా సమస్యలకు పరిష్కారం-నిర్ణయాల మందు సరైన చర్చల ద్వారా మంచి నిర్ణయాలు జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

జగన్ తిరిగి 2023 లో అధికారంలోకి..

జగన్ తిరిగి 2023 లో అధికారంలోకి..

జగన్ ఎవరి మాట వినరని..ఎవరి సలహాలు స్వీరించరనే విమర్శలకు కేవీపీ సమాధానం దాట వేసారు. ఇక, 2023 లో తిరిగి జగన్ అధికారంలోకి వస్తారా అనే ప్రశ్నకు కేవీపీ నేరుగా స్పందించలేదు. జగన్ కు ప్రజల్లో ఉన్న బలం గురించి ప్రస్తావించారు. అదే విధంగా ఇంకా రెండున్నారేళ్ల తరువాత జరిగే ఎన్నిక గురించి తాను ముందే చెప్పటానికి జ్యోతిష్కుడిని కాదని..తాను రాజకయంగా మాత్రమే చెప్పగలనని సమాధానం ఇచ్చారు. ఇక, జగన్ ప్రస్తుతం ఉన్న మంత్రులను అందిరనీ తీసి వేసి..మొత్తంగా కొత్త వారిని తీసకుంటారనే ప్రశ్నకు కేవీపీ రియాక్ట్ అయ్యారు.

 ఆ తరువాత నేను జగన్ ను కలవలేదు..

ఆ తరువాత నేను జగన్ ను కలవలేదు..

తొలుత 90 శాతం మందిని తీసేస్తామని గతంలోనే జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. జగన్ ప్రమాణ స్వీకారం తరువాత సీఎంతో తనకు నేరుగా సంబంధాలు లేవని..మిత్రుల ద్వారా తెలుస్తున్న విషయాలపైనే తాను స్పందిస్తున్నానని చెప్పారు. అందులో భాగంగా అనుభవం ఉన్న వారితో కీలక అంశాల పైన చర్చలు చేసి..నిర్ణయాలు తీసుకొనే వారంటూ వైఎస్సార్ గురించి చెబుతూ.. పరోక్షంగా జగన్ కు అదే సూచన చేసారు. ఇక, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారన్నారు.

Recommended Video

    Tata Steel To Take Over Vizag Steel Plant? | Privatization | AP | Oneindia Telugu
    తెలంగాణలో అధికారంలోకి ఖాయంగా..

    తెలంగాణలో అధికారంలోకి ఖాయంగా..

    కాంగ్రెస్ పార్టీలో ప్రమేయం పైన స్పందిస్తూ..కొంత నిప్పు ఉన్న మాట నిజమని.. అదే సమయంలో కొంత నిప్పు ఉందని..కొంత పొగ వస్తుందని విశ్లేషించారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని స్పష్టం చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి పైన రాహుల్ ఫోకస్ పెట్టారని వివరించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కేవీపీ ధీమా వ్యక్తం చేసారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+