• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ ? కొత్త జిల్లాలపై మౌనం - తెర వెనుక ఏం జరుగుతోంది ?

|

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ తాజాగా క్లాసు పీకారా ? ఎమ్మెల్యేలు కొంతకాలంగా సైలెంట్ కావడం వెనుక కారణాలేంటి ? ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అధికార పార్టీ ఎమ్మెల్యేల మౌనం వెనుక ఏం జరుగుతోంది ? కొత్త జిల్లాల ఏర్పాటుపై నిన్న మొన్నటి వరకూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధులు తాజాగా మౌనాన్ని ఆశ్రయించడాన్ని బట్టి చూస్తే ఇదంతా నిజమే అనిపించకమానదు. పార్టీ వర్గాలు కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఎమ్మెల్యేలే కాదు వైసీపీకీ చెందిన ఏ నేత కూడా బహిరంగంగా మాట్లాడే పరిస్ధితి లేదు.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ..

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ..

ఏపీలో తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలుగా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగానే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే కొత్త జిల్లాలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటుతో పాటు క్షేత్రస్ధాయిలో పరిశీలన కూడా చురుగ్గా సాగుతోంది. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్త జిల్లాల ప్రకటన చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అవసరమైన నిధులతో పాటు ఇతర అనుమతులు కూడా ఇచ్చి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో అధికార వైసీపీ నేతల పాత్ర ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎవరికి వారు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్న వేళ.. కొత్త జిల్లాల ఏర్పాటు వీరు చెప్పినట్లు ఉంటుందా లేదా అనే చర్చ సాగుతోంది.

 కొత్త జిల్లాలపై భిన్నస్వరాలు.

కొత్త జిల్లాలపై భిన్నస్వరాలు.

ఎప్పుడైతే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిందో అప్పటి నుంచి 13 జిల్లాల్లో రకరకాల డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. భిన్నస్వరాలను వినిపించిన వారిలో అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ మొదలైన నాటి నుంచి వైసీపీ సీనియర్లు, ఎమ్మెల్యేలు అంతా బహిరంగంగానే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు చెయ్యడంతో పాటు జిల్ల్లాల ఏర్పాటుపై తమ అభిప్రాయాన్ని తీసుకోవాలని, లేకపోతే దేనికైనా సిద్ధమేనంటూ హెచ్చరికలు కూడా చేయడం ప్రారంభించారు. ఇలా ఉత్తరాంద్ర నుంచి రాయలసీమ వరకు పెద్ద ఎత్తున కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం మొదలుపెట్టారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్

మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్

పరిస్ధితి అదుపు తప్పుతుండటంతో స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ రంగంలోకి దిగారు. కొత్త జిల్లాలపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ పార్టీ పరువును, ప్రభుత్వాన్ని బజారున పెడుతున్నారంటూ క్లాస్ పీకారు. గత కేబినెట్ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన చర్చలో సీఎం జగన్ కొందరు మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వ ఆలోచననను ఇద్దరు మంత్రులకు స్పష్టంగా చెప్పడంతో పాటు కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకురావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు బాధ్యత మొత్తం అధికారులకే అప్పజెబుతున్నామని, ఇందులో రాజకీయ జోక్యాన్ని సహించబోనని క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు ఎక్కడా జిల్లాల అధ్యయన కమిటీలపై ఒత్తిడి ఉండకూడదంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలకూ ఆదేశాలు జారీ చేశారు.

 జగన్ హెచ్చరికలతో మౌనం...

జగన్ హెచ్చరికలతో మౌనం...

సీఎం జగన్ హెచ్చరికలతో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలు చెప్పాలనుకున్న కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మనకెందుకులే మౌనం దాల్చినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ వంటి పెద్ద అంశంలోనే స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌కు.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎలాంటి ప్రతికూల కామెంట్లు చేయడం లేదని అందుకే, కొత్త జిల్లాల ఏర్పాటుపై కామెంట్స్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం తప్ప.. ఎటువంటి ఉపయోగం ఉండదని నేతలంతా భావిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీలోని ఇంకొందరు నేతలు ఓ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తు చేయడంతో పాటు, కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎవరైతే అభ్యంతరాలు తెలియచేయాలని భావిస్తున్నారో ఆ అభ్యంతరాలను పార్టీ టిక్కెట్లను.. బీ-ఫారాలు తీసుకున్న సమయంలో ఎందుకు చెప్పలేదని సెటైర్లు వేస్తున్నారట.

English summary
andhra pradesh chief minister and ysrcp president ys jagan mohan reddy has ordered his mlas to keep quiet on formation of new districts until his next orders in wake of disputes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X