ప్రధాని నరేంద్ర మోడీతో భేటి కానున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి

Recommended Video

    AP CM Jagan Going To Delhi On Tuesday | ప్రధాని నరేంద్ర మోడీతో భేటి కానున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి!!

    ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఢిల్లి వేళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించనున్న జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్‌తో సమావేశం కానున్నారు. సమావేశంలో బాగంగా ఏపి పునర్విభజనతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులపై చర్చించనున్నట్టు సమచారం.

    కాగా రెండు రోజుల రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం ఉదయం 9.30 గంటలకు తన నివాసం నుండి బయలు దేరి మధ్యహ్నాం ఢిల్లీకి చేరుకొనున్నారు. అనంతరం కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటి కానున్నారు. సాయంత్రం అయిదు గంటలకు ప్రధానమంత్రి మోడీతో సమావేశం కానున్నారు. ఇక మంగళవారం ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి బుధవారం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, 11.30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన భేటీ కానున్నారు. అదే రోజు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.

    AP cm Jaganmohan reddy will meet Prime Minister Narendra Modi

    ఇక ఇప్పటికే కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కశ్మీర్ విభజన బిల్లుకు వైసీపి మద్దతు తెలిపింది. ఈనేపథ్యంలోనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాలు, పోలవరం టెండర్ల రద్దు విషయంపై ప్రధానితో చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+