విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి సూర్యుడే బ్రాండ్ అంబాసిడర్‌:చంద్రబాబు; ముస్లిం సంఘాల అభ్యంతరం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Surya Aaradhana : ఏపీ బ్రాండ్ అంబాసిడర్ 'సూర్యుడు'

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూర్యుడే అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో సూర్యారాధన కార్యక్రమం జరిగింది.

తూర్పుతీర ప్రాంతంగా ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున 'సన్ రైజ్ స్టేట్'గా నినాదమిచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూర్యారాధాన కార్యక్రమంలో చెప్పారు. సౌరశక్తి వినయోగాన్ని ప్రోత్సహిస్తూ కాలుష్య నియంత్రణకు తోడ్పడేలా ఈ కార్యక్రమానికి ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సూర్యారాధన కార్యక్రమాన్ని ప్రజాహిత వేడుకగా పేర్కొన్న చంద్రబాబు దీన్ని ఏటా రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతిని ఆరాధించడంలో భాగంగానే జలహారతి, సూర్యారాధన, అమ్మకు వందనం అనే కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు.

సూర్యుడే..బ్రాండ్ అంబాసిడర్...

సూర్యుడే..బ్రాండ్ అంబాసిడర్...

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఉదయం నిర్వహించిన సూర్యారాధన కార్యక్రమానికి హాజరైన సీఎం...
ఏపీకి అంబాసిడర్ సూర్యుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని చెప్పారు. అన్ని మతాల్లోనూ సూర్యునికి ప్రాధాన్యత ఉందన్నారు.
అరబ్ దేశాల్లో సూర్యుడ్ని షమ్స్ అనే పేరుతో ఆరాధిస్తారని, అటు క్రైస్తవులూ బైబిల్‌లో ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. సర్వజనీన నిత్యచైతన్య శక్తిగా ఉన్న సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా, మానసికంగా వృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు. చైతన్యమూర్తి అయిన సూర్యుడిని ఆరాధిస్తే మనం నిత్య ప్రేరణ పొందొచ్చవచ్చని అన్నారు. సూర్యుడు జస్టిస్ చక్రవర్తి లాంటివాడని. పేదా.. గొప్పా అనే వ్యత్యాసం లేకుండా అందరిని సమానంగానే చూస్తాడని చంద్రబాబు పేర్కొన్నారు.

 ప్రేరణ...సూర్యుడి నుంచి రోజూ...

ప్రేరణ...సూర్యుడి నుంచి రోజూ...

460 కోట్ల సంవత్సరాల వయసున్న సూర్యుడు నుంచి మనం రోజూ శక్తిని పొందుతూనే ఉన్నామన్నారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలని.. ప్రకృతిని, సాంకేతికతను సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రెండూ మానవ మనుగడకు అవసరమేనని అన్నారు. సూర్యారాధన ఏ మతానికి సంబంధించిన అంశం కాదని... దీనిపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సౌరశక్తితోనే 5 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 1000 మెగావాట్లు సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని తెలిపారు.

సూర్యారాధన...ఆసనాలు

సూర్యారాధన...ఆసనాలు

అనంతరం సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చి సూర్యారాధన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆరంభించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఆచారాలను అనుసరించి ప్రార్ధనలు నిర్వహించారు. సూర్యారాధన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్ధులు హాజరై 12 రకాల ఆసనాలతో సూర్యారాధన చేశారు.

ముస్లింల...ఆక్షేపణ...

ముస్లింల...ఆక్షేపణ...

అయితే సూర్యనమస్కారాల కార్యక్రమాలలో అన్ని మతాల వారు పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునివ్వడంపై ముస్లిం సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సూర్యనమస్కారాల కార్యక్రమంలో తాము పాల్గొనబోమని ముస్లిం సంఘాల నాయకులు చెప్పారు. ఆదివారం జరగనున్న సూర్యనమస్కారాల కార్యక్రమాలలో అన్ని మతాల వారు పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునివ్వడం ఆక్షేపణీయమన్నారు. ముస్లిం ఉద్యోగులను, విద్యార్థులకు ఈ కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈమేరకు విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు. ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు హబీబుర్‌ రహమాన్‌, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముక్తార్‌ ఆలీ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యునిపై నమ్మకం ఉన్నవాళ్లనే ఈకార్యక్రమానికి పరిమితం చేయాలని, అన్ని మతాలకు చెందిన వారి సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

English summary
Vijayawada: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Sunday launched 'Surya Aaradhana' (Sun worship) programme in Vijayawada to promote solar energy and reduce pollution. Naidu launched the programme at Indira Gandhi Municipal Stadium here. This is for the first time in history that a government has started program for worshipping the nature. The sun is worshipped in different religions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X